ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్యలో సందడి చేశాడు. అయితే ఇది ఫుల్ లెంత్ రోల్ కాదు. దీంతో అతని తర్వాతి ప్రాజెక్టుపై బోలెడు అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే సౌత్ ఇండియన్ సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు చరణ్. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చెర్రీ సరసన రొమాన్స్ చేయనుంది. కాగా RC15 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చెర్రీ ఫోటోస్ , వీడియోస్ నెట్టింట లీకై వైరల్‌గా మారాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ సోమవారం (అక్టోబర్10) నుంచి రాజమండ్రిలో జరగనుందట. ఇందుకోసం రామ్‌చరణ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడట. మొత్తం ఆరు రోజుల పాటు రాజమండ్రిలోనే షూట్ జరగనున్నట్లు సమాచారం.
కాగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. భారీ స్టార్ క్యాస్టింగ్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో హ్యూమా ఖురేషి, శ్రీకాంత్, అంజలీ, సునీల్, ఎస్.జే. సూర్య, నవీన్ చంద్ర, నాజర్, సముద్రఖని, జయరాం తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. చెర్రీ డబుల్ రోల్‌లో నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా చెర్రీ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
#RamCharan Latest ? Instagram Post ?
Rajahmundry schedule for #RC15 starts from Tomorrow (6 Days Schedule for Father role)#RamCharanForOscars ? #RRRInJapan pic.twitter.com/74fDlBAe76
— Ujjwal Reddy (@HumanTsunaME) October 9, 2022