AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: ఇండియాలో సరోగసీ బ్యాన్.. సంచలన ట్వీట్ చేసిన సీనియర్ హీరోయిన్ కస్తూరి

స్టార్ హీరోయిన్ నయనతార తల్లయ్యారు. నయనతార-విఘ్నేష్ శివన్ కపుల్‌కు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. కాగా ఈ సెలబ్రిటీ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారని ప్రచారం జరుగుతుంది.

Nayanthara: ఇండియాలో సరోగసీ బ్యాన్.. సంచలన ట్వీట్ చేసిన సీనియర్ హీరోయిన్ కస్తూరి
Nayanathara Kasturi
Ram Naramaneni
|

Updated on: Oct 10, 2022 | 9:21 AM

Share

సెలబ్రిటీలు బిడ్డల్ని కనడం లేదు..సరోగసీ ద్వారా అద్దె గర్భం ద్వారా తల్లి దండ్రులు అవుతున్నారు..ఇపుడు నయనతార..గతంలో చాలామంది సెలబ్రిటీలు ఇదే బాటలో పిల్లలను కన్నారు. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి, మంచులక్ష్మి, కరణ్‌జోహార్‌ కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్‌ నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులు తాజాగా ట్విన్స్‌కి అమ్మానాన్నలు అయ్యారు. ఈ విషయాన్ని వారే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఫోటోలను షేర్ చేశారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను కోరారు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్‌, విఘ్నేశ్‌ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. .

ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్‌-విక్కీలు జూన్‌ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఇప్పుడు కవలలకు జన్మనిచ్చారు. ఇదలా ఉంటే సీనియర్ హీరోయిన్‌ కస్తూరి ట్వీట్‌ దుమారం రేపుతోంది. ‘ఇండియాలో సరోగసీపై బ్యాన్‌ ఉంది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప…సరోగసిని ప్రోత్సహించకూడదు.. ఈ చట్టం జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చింది. దీని గురించి మనం రాబోయే రోజుల్లో చాలా వినబోతున్నాం’  అంటూ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశం అయింది. అయితే ఈ ట్వీట్‌ ఎవరిని ఉద్దేశించి అన్నది ఎక్కడా కస్తూరి ప్రస్తావించలేదు.

అయితే ఈ ట్వీట్ నయన్ దంపతుల గురించే అని ఫిక్సయిన ఫ్యాన్స్ కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టారు. పక్కన వాళ్ల గురించి పట్టించుకోవడం మానేసి..  తన పని తాను చూసుకోవాలని హితబోధ చేశారు. ఇక నెటిజన్లకు కూడా తన మార్క్ కౌంటర్ ఇచ్చారు కస్తూరి. లాయర్‌గా అర్హత సాధించిన వ్యక్తిగా చట్టపరమైన అంశాలపై విశ్లేషణ చేసే హక్కు ఉందని ఆమె పేర్కొన్నారు. నిస్వార్ధంగానే మాట్లాడాను..ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని రిప్లయి ఇచ్చారు.

ట్రెడిషనల్ సరోగసీ ============= ట్రెడిషనల్‌ పద్దతిలో భార్యకు సమస్య ఉన్నప్పుడు భర్త నుంచి వీర్యాన్ని సేకరించి దాన్ని మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టి బిడ్డ కంటారు.ఈ విధానంలో పుట్టే బిడ్డకు సరోగసీ పద్ధతికి ఒప్పుకున్న తల్లికి జన్యు సంబంధం ఉంటుంది. బిడ్డకు ఆమె పోలికలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

జెస్టేషనల్ సరోగసీ:

=============

జెస్టేషనల్ పద్ధతిలో భార్య నుంచి అండాన్ని, భర్త నుంచి వీర్యాన్నీ సేకరించి ల్యాబ్ లో ఫలదీకరించి మరో స్త్రీ గర్భంలో ప్రవేశ పెడతారు. ఇలా చేయడం వల్ల గర్భం మోసే తల్లికి, బిడ్డకు ఎటువంటి జన్యు సంబంధం ఉండదు. సరోగసీ మదర్ వివారలను కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. దాదాపు ఈ విధానంలోనే ఎక్కువ మంది సెలెబ్రిటీలు బిడ్డలను కంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..