Nayanthara: నయనతారకు కవలలు పుడతారని ముందే చెప్పిన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే చర్చ..
తాము కవలలకు జన్మనిచ్చామంటూ నయనతార, విఘ్నేష్‌లు సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారో లేదో పెద్ద చర్చకు దారి తీసింది. అదేంటీ ఈ జంట వివాహం అయ్యి నాలుగు నెలలు కూడా కాలేదు...
తాము కవలలకు జన్మనిచ్చామంటూ నయనతార, విఘ్నేష్‌లు సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారో లేదో పెద్ద చర్చకు దారి తీసింది. అదేంటీ ఈ జంట వివాహం అయ్యి నాలుగు నెలలు కూడా కాలేదు, నయన్ ఎప్పుడూ గర్భం దాల్చినట్లు కూడా కనిపించలేదు అప్పుడే కవలలు జన్మించడం ఏంటని ఆశ్చర్యపోయారు. అయితే ఈ జంట వివాహానికి ముందే సరోగసి ద్వారా పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారని అర్థమై, ఓహో అసలు విషయం ఇదా అని అనుకున్నారు.
దాదాపు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట జూన్ 9వ తేదీన వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక తాము పేరెంట్స్‌గా మారామాన్న సంతోషకరమైన విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్న ఈ క్యూట్ కపుల్ లవ్లీ ఫొటోను షేర్ చేశారు. చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న సమయంలో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే నయనతార కవలలకు జన్మనిస్తుందని ఎన్టీఆర్ ముందే చెప్పాడంటూ నెట్టింట తెగ సందడి చేస్తోంది.
View this post on Instagram
అదేంటి నయనతార పిల్లల గురించి ఎన్టీఆర్ ముందే ఎలా చెప్తాడనేగా మీ సందేహం. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్, నయనతార జంటగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో స్వి్మ్మింగ్ పూల్ సన్నివేశంలో నయనతారకు మచ్చ శాస్త్రం గురించి వివరిస్తూ.. నడుముపై పుట్టు మచ్చ కారణంగా మీకు కవల పిల్లలు పుడతారంటూ ఓ డైలాగ్ ఉంటుంది. అయితే ఈ డైలాగ్‌ను కామెడీ కోసం రాసినా ప్రస్తుతం నయన్ నిజంగానే కవలలకు జన్మనివ్వడంతో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. తమ క్రియేటివిటీని జోడిస్తూ కొందరు మీమర్లు వీడియోలు, ఫొటోలను రూపొందిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్‌లు చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..