Ram Charan : ఒక్క ఫైట్ కోసం అంత ఖర్చు చేస్తున్నారా..! చరణ్ శంకర్ మూవీ క్రేజీ అప్డేట్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశాడు.

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు చెర్రీ. RC15 అనే టైటిల్ వర్కింగ్‍తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. ఇక వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాకోసం దాదాపు 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తమన్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఆర్లీ 15 సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గతంలో శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో తమన్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరోసారి శంకర్ సినిమాకు వర్క్ చేయబోతున్నాడు తమన్.
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఓ భారీ ఫైట్ సీన్ ఉండనుందట. రన్నింగ్ ట్రైన్ లో సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకర్ణించానున్నారట. వందమంది ఫైటర్లు ఈ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం 10 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తుంది. దాంతో ఈ ఫైట్ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో, శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అరాచకాలు.. లోబో బండారం బయటపెట్టిన పింకీ..
PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో
Mahesh Babu MAharshi: ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. మహేష్ బాబు మాటల్లో ఆనందం అసలు మేటరేంటంటే..(వీడియో)