AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : ఏమున్నాడ్రా బాబూ.. లాంగ్ హెయిర్.. రగ్గడ్ లుక్.. మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పెద్ది సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

Ram Charan : ఏమున్నాడ్రా బాబూ.. లాంగ్ హెయిర్.. రగ్గడ్ లుక్.. మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై రామ్ చరణ్..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Apr 14, 2026 | 9:55 AM

Share

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు చరణ్. దీంతో ఆయన అప్ కమింగ్ మూవీస్ పై యావత్ వరల్డ్ వైడ్ బజ్ నెలకొంది. ఎప్పుడెప్పుడు చరణ్ సినిమాలు విడుదలవుతాయా అని వెయిట్ చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ లవర్స్. ఇదిలా ఉంటే.. చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పై ఇప్పటికే హైప్ నెలకొంది. ఇందులో జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నా్రు. అలాగే ఇందులో సీనియర్ నటుడు సాయి కుమార్ సైతం ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు చరణ్ న్యూలుక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

తాజాగా రామ్ చరణ్ ఫోటోను ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై ముద్రించారు. ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్న చరణ్.. కొన్ని రోజుల క్రితం దుబాయ్ వెళ్లి మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ నిర్వహించారు. ఆ ఫోటోలనే ఇప్పుడు ఎస్క్ర్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ లో పబ్లిష్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులో చెర్రీతోపాటు ఆయన పెట్ డాగ్ రైమ్ సైతం కనిపిస్తుంది. ఇందులో చరణ్ లాంగ్ హెయిర్, రగ్గడ్ లుక్ తో మాస్ వాకింగ్ స్టైల్ తో కనిపిస్తున్నారు. చరణ్ స్టైల్ చూసి ఫిదా అవుతున్నారు మెగా ఫ్యాన్స్.

ఎక్కువ మంది చదివినవి : Cinema : థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా.. విడుదలైన మూడు రోజులకే సంచలనం..

“గ్లోబల్ ఫోర్స్ గా ఎదుగుతున్న రామ్ చరణ్ నేటి ఇండియన్ సినిమాకు ఒక నిర్వచనంలా నిలుస్తున్నారు. కానీ ఈ స్థాయికి రావడం వెనుక ఒక నిశ్సబ్దమైన కథ ఉంది. అది క్రమశిక్షణ, సహజ ప్రవృత్తి, అచంచలమైన ఆత్మవిశ్వాసంపై నిర్మించబడింది. ఇన్నేళ్ల తన అద్భుతమైన కెరీర్ లో చరణ్ ఎప్పుడూ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నించలేదు. వాటిని మెరుగుపరుస్తున్నారు. నటన కన్నా తన ఉనికిని, కేవలం ఆర్బాటం కకన్నా అర్థాన్ని ఎంచుకుంటున్నారు. ఆయన మునుపెన్నడూ చూడని కొత్త రూపంలోకి అడుగుపెట్టిన మా లేటేస్ట్ కవర్ పేజీని మేము ఆయనతో ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం” అంటూ రాసుకొచ్చింది ఎస్క్వైర్ ఇండియా.

ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

ఎక్కువ మంది చదివినవి : Singer Mangli : అతడికి శ్రీముఖి పై క్రష్.. బిగ్ బాస్ కోసమే ఈ ప్లాన్.. మంగ్లీ సంచలన కామెంట్స్..

Follow Us