AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత రివీల్ చేసిన ‘8 స్టెప్ పవర్ మార్నింగ్’..! ఈ పనులతో రోజంతా ఉత్సాహం గ్యారెంటీ

 నేటి వేగవంతమైన జీవనశైలిలో ఉదయాన్నే నిద్రలేవగానే ఫోన్ చూడటం, ఈ-మెయిల్స్ చెక్ చేయడం మనకు తెలియకుండానే ఒత్తిడిని పెంచుతున్నాయి. దీనివల్ల రోజంతా ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా శారీరక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి సమంత తన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలను అభిమానులతో పంచుకున్నారు. ఆమె స్వయంగా పాటించే '8 స్టెప్ పవర్ మార్నింగ్' రొటీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమంత రివీల్ చేసిన '8 స్టెప్ పవర్ మార్నింగ్'..! ఈ పనులతో రోజంతా ఉత్సాహం గ్యారెంటీ
Samanthaah Ruth Prabhu
Nikhil
|

Updated on: Apr 14, 2026 | 9:29 AM

Share

మనం ఉదయాన్నే చేసే పనులే ఆ రోజంతా మనం ఎంత ఉత్సాహంగా ఉంటామో నిర్ణయిస్తాయని సమంత గట్టిగా నమ్ముతారు. ఒకవేళ మీరు అన్నీ సరిగ్గా చేస్తున్నా పొట్ట దగ్గర కొవ్వు తగ్గకపోయినా లేదా చర్మ సమస్యలు వేధిస్తున్నా, మీ మార్నింగ్ రొటీన్‌ను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె హెచ్చరిస్తున్నారు. కేవలం 21 రోజుల పాటు ఈ నియమాలను పాటిస్తే శరీరంలో వచ్చే సానుకూల మార్పులను మీరే గమనించవచ్చు.

ఒత్తిడిని తగ్గించే తొలి అడుగులు

నిద్రలేవగానే మన శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్లు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో ఫోన్ చూడటం వల్ల మెదడు డోపమైన్ కిక్ కోసం ఆరాటపడుతూ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అందుకే సమంత చెప్పే మొదటి సూత్రం.. నిద్రలేచిన మొదటి గంటసేపు ఫోన్‌కు దూరంగా ఉండటం. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉంటూ శ్వాసపై ధ్యాస పెట్టాలి. కాసేపు సూర్యరశ్మి తగిలేలా ఎండలో గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్-డి అందడమే కాకుండా మనసు ప్రశాంతంగా మారుతుంది.

శరీరాన్ని శుద్ధి చేసే పానీయం

సమంత తన రోజును ఒక ప్రత్యేకమైన హెల్త్ డ్రింక్‌తో ప్రారంభిస్తారు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, పసుపు, కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ఆర్గానిక్ ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. ఆ తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచే పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల రోజంతా తీపి పదార్థాల మీదకు మనసు వెళ్లకుండా ఉంటుంది. ఉదయం 11 గంటల లోపే వ్యాయామం పూర్తి చేయడం వల్ల మెటబాలిజం వేగవంతం అవుతుంది.

నిపుణుల విశ్లేషణ

నిపుణుల ప్రకారం ఉదయాన్నే నీళ్లు తాగడం, వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ ఉత్తేజితం అవుతుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను క్రమబద్ధీకరించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్పాహారం తర్వాతే టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ సమస్యలు రావు. అలాగే ఆరోజు చేయాల్సిన పనులను ముందే రాసి పెట్టుకోవడం వల్ల మెదడుకు స్పష్టత లభిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులే దీర్ఘకాలంలో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Follow Us