భారత్‌లో మామిడిపండ్లను ఎక్కువగా పండిచే రాష్ట్రం ఏదో తెలుసా!
Samatha
14 April 2026
మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా ప్రతిరోజూ మామిడి పండ్లను తింటారు.
మామిడిపండ్లు
ఇక మార్కెట్‌లో అనేక రకాల మామిడిపండ్లు ఉన్నాయి. ఒకొక్కరికీ ఒక్కో రకమైన మామిడి పండ్లు ఇష్టం ఉంటాయి.
అనేక రకాల మామిడి పండ్లు
అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు పండ్లలో రాజు అయిన ఈ మామిడి పండ్లను భారత్‌లో ఏ రాష్ట్రం ఎక్కువగా పండిస్తుందో, దాని గురించి తెలుసుకుందాం.
ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం
భారత దేశంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మామిడి పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. సంవత్సరానికి 2.5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందంట.
ఉత్తర్ ప్రదేశ్
అదే విధంగా ఉత్తర ప్రదేశ్ తర్వాత మామిడి పంట సాగులో, ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి 1.2 మిలియన్ మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అవుతుంది.
ఆంధ్రప్రదేశ్
బిహార్ మామిడి పంట సాగులో మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ సంవత్సరానికి 800,000 మెట్రిక్ టన్నుల మామిడి పంటను ఉత్పత్తి చేస్తారంట.
బిహార్
భారత్‌లో మహారాష్ట్ర మామిడి పంట ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో ఉంది. ఇక్కడ చాలా స్పెషల్ అల్పోన్సో మామిడి పండ్లను ఎక్కువగా పండిస్తారు, సంవత్సరానికి 600,000 టన్నుల పంట పండిస్తారు.
మహారాష్ఠ్ర
తర్వాత స్థానంలో తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ మామిడి పంట ఎక్కువగా పండుతుంటుంది.