Rakul Preet Singh: ఆ విషయంలో నేనేప్పటికీ బాధపడను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రకుల్..
తన సినిమాల్లో ఎంతమంది హీరోలు.. నటీనటులు ఉంటారనే విషయంలో తాను ఎప్పటికీ చింతించను అని చెప్పుకొచ్చింది రకుల్.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh ).. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తన సినిమాల్లో ఎంతమంది హీరోలు.. నటీనటులు ఉంటారనే విషయంలో తాను ఎప్పటికీ చింతించను అని చెప్పుకొచ్చింది రకుల్. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి.. సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది రకుల్.
నేను ఓ వ్యక్తిగా చాలా సురక్షితంగా ఉన్నాను.. నా ఎదుగుదల కోసం ఇంకా ఎక్కువ పనిచేయాలని ఆరాపటపడుతుంటాను. నేను ఎన్ని సినిమాలు చేశాను అని కాదు, ఎంత గొప్ప పాత్రలు చేశామన్నదే ముఖ్యం. ఇంకా సినిమాలు చేయాలి. మరిన్ని మంచి పాత్రలు చేయాలి. ఇంకా ఎక్కువ అవకాశాల కోసం ఎదురుచూస్తుంటాను. నటిని కావాలనే సంకల్పంతో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజున నా దగ్గర ఉన్నది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమే. అదే నా ఆయుదం. ఎన్ని అడ్డంకులు వచ్చిన ఆత్మ విశ్వాసంతో అధిగమించాను. మానసికంగా అప్పుడు ఎంత స్థిరంగా ఉన్నానో. ఇప్పుడు అంతే బలంగా ఉన్నాను. నా సినిమాలు, పాత్రల పట్ల సంతృప్తిగానే ఉన్నాను. నాకు మరిన్ని అవకాశాలు ప్రజలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వరకు నచ్చిన చిత్రాలకు నేను చాలా కృతజ్ఞురాలిని అంటూ చెప్పుకొచ్చింది రకుల్. అలాగే తన సినిమాల్లో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే విషయం పట్టించుకోనని.. సినిమాలో ఎవరి పాత్ర వారిది.. ఏ పాత్ర ప్రాధాన్యం దానికే ఉంటుందని అన్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..