Rakul Preet Singh : అలా జరగడం ఇష్టం లేదు.. రిలేషన్ షిప్ పై రకుల్ ఆసక్తికర కామెంట్స్
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య జోడు తగ్గించిందనే చెప్పాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ అందాల భామ.
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh )ఈమధ్య జోరు తగ్గించిందనే చెప్పాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ అందాల భామ. రకుల్ తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది. ఇక ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇండియన్ 2మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే చాలా కాలంగా రకుల్ ప్రేమ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో తేలిపోతుందని టాక్ గాట్టిగా వినిపిస్తుంది. తాజాగా జాకీ భగ్నానీతో తనకున్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది రకుల్. రీసెంట్ గా ఓ ఇంట్రవ్యూలో రకుల్ మాట్లాడుతూ…
జాకీ తనకు చాలా మంచి స్నేహితుడని.. ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని చెప్పుకొచ్చింది. తమ మధ్య రిలేషన్ షిప్ స్టార్ట్ అయినప్పుడే అందరికి చెప్పేయాలనుకున్నాం. ఎందుకంటే తమ ప్రేమ వ్యవహారం బయట పెట్టకపోతే ఎవరికీ ఇష్టమొచ్చినట్టు వారు అవాస్తవాలు ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాలతో ప్రశాంతతను కోల్పోతాం అని చెప్పుకొచ్చింది రకుల్. సెలెబ్రెటీల పైనే అందరి దృష్టి ఉంటుంది. అందుకే మా రిలేషన్ గురించి మేమే చెప్పేయాలని అనుకున్నాం అంది. అందరూ తమ పని గురించి మాట్లాడుకోవాలని.. తమ పర్సనల్ లైఫ్ గురించి కాదని తెలిపింది రకుల్. మన జీవితాల్లో తల్లిదండ్రులు, సిస్టర్స్, బ్రదర్స్ , ప్రెండ్స్ ఎలా ఉంటారో… అలాగే మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉంటాడని చెప్పింది రకుల్.
మరిన్ని ఇక్కడ చదవండి :