AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ముసుగు చాటున అందమైన వెన్నెలమ్మ.. ఆ కళ్లు చెప్పే మాటలకు అర్థాలేన్నో..! ఆమె ఎవరో తెలుసా ?..

కళ్లు కూడా మాట్లాడతాయి.. కోప్పడతాయి.. ఎన్నో సంగతులు చెప్తాయి అన్నట్టుగా.. అందమైన నయనాలు పలికే భావాలు అనేకం ఉంటాయి కదూ.. అచ్చం ఈ డైలాగ్‏నే గుర్తుచేస్తుంది పై ఫోటో.

Viral Photo: ముసుగు చాటున అందమైన వెన్నెలమ్మ.. ఆ కళ్లు చెప్పే మాటలకు అర్థాలేన్నో..! ఆమె ఎవరో తెలుసా ?..
Actress
Rajitha Chanti
|

Updated on: May 23, 2022 | 12:06 PM

Share

కళ్లు కూడా మాట్లాడతాయి.. కోప్పడతాయి.. ఎన్నో సంగతులు చెప్తాయి అన్నట్టుగా.. అందమైన నయనాలు పలికే భావాలు అనేకం ఉంటాయి కదూ..  అచ్చం ఈ డైలాగ్‏నే గుర్తుచేస్తుంది పై ఫోటో ..  చూశారు కదా.. ఆ ముసుగు చాటున ఓ అందమైన వెన్నెలమ్మ.. ఆమె కళ్లు చెప్పే మాటలకు అర్థాలు చాలనే ఉన్నాయి.. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. దక్షిణాదిలోనే కాదండోయ్ ఇప్పుడు ఉత్తరాదిలోనూ.. హాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంది. ఎవరో గుర్తుపట్టండి..

ఈ అందమైన చిన్నది మరెవరో కాదండోయ్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఏమాయ చేసావే అంటూ తెలుగు తెరకు పరిచమయైన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ.. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యను ప్రేమవివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ 2021లో అధికారికంగా విడాకులు తీసుకుని.. తమ బంధానికి స్వస్తి చెప్పినట్లు ప్రకటించారు. విడాకుల అనంతరం సామ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం యశోద, ఖుషి సినిమాలు చేస్తుంది. తాజాగా ఖుషి సినిమా కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈసినిమా చిత్రీకరణ నుంచి తన లేటేస్ట్ ఫోటో షేర్ చేస్తూ కశ్మీర్ పై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది.. “కశ్మీర్.. నీ గురించి తలుచుకున్నప్పుడల్లా చిరునవ్వే వస్తుంది.. ఈ నా మనసు ఎప్పుడూ ఉంటుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న 2022లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి