Major Movie: మేజర్ టీం అనుహ్య నిర్ణయం.. విడుదలకు ముందే ప్రీమియర్స్ షోస్..

26/11 దాడులలో వీరమరణం పొందిన మేజర్ ఉన్ని 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న

Major Movie: మేజర్ టీం అనుహ్య నిర్ణయం.. విడుదలకు ముందే ప్రీమియర్స్ షోస్..
Major
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2022 | 1:11 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్ (Major).. 26/11 దాడులలో వీరమరణం పొందిన మేజర్ ఉన్ని 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తుండగా.. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా మేజర్ సినిమా విడుదల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ సినిమాను దేశవ్యాప్తంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రీవ్యూస్ వేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రివ్యూ స్క్రీనింగ్ వేయనున్నారట. విడుదలకు పది రోజుల ముందు అంటే మే 24 నుంచి ఈ సినిమా ప్రివ్యూ స్క్రీనింగ్ చేయనున్నారు. ఇలా రిలీజ్ కంటే ముందే విడుదల చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఇందుకోసం ప్రముఖ బుక్ మై షో తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సినిమా ప్రివ్యూస్ చూడాలనుకున్నవారు బుక్ మై షోలో టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. హైదారాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగుళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్, కొచ్చి మొదలైన నగరాల్లో ఈ సినిమా ప్రివ్యూస్ ప్రదర్శిస్తారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేధికంగా అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో జూన్ 3న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..