AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput: చిక్కుల్లో పాయల్.. రెమ్యునరేషన్ తీసుకొని హ్యాండ్ ఇచ్చిందన్న నిర్మాతలు

తొలిసినిమాలోనే రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయి నటించింది. దాంతో ఈ చిన్నది ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ఆర్ఎక్స్100 సినిమా రేంజ్‌లో హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ చిన్నది. మాస్ రాజా రవితేజ సరసన డిస్కో రాజా, వెంకటేష్ సరసన వెంకీమామ సినిమాలో నటించింది పాయల్. కానీ సక్సెస్ కాలేకపోయింది.

Payal Rajput: చిక్కుల్లో పాయల్.. రెమ్యునరేషన్ తీసుకొని హ్యాండ్ ఇచ్చిందన్న నిర్మాతలు
Payal Rajputh
Rajeev Rayala
|

Updated on: May 21, 2024 | 12:04 PM

Share

ఒకే ఒక్క సినిమాల పాయల్ రాజ్ పుత్ పేరు మరు మ్రోగేలా చేసింది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలివుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలిసినిమాలోనే రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయి నటించింది. దాంతో ఈ చిన్నది ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ఆర్ఎక్స్100 సినిమా రేంజ్‌లో హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ చిన్నది. మాస్ రాజా రవితేజ సరసన డిస్కో రాజా, వెంకటేష్ సరసన వెంకీమామ సినిమాలో నటించింది పాయల్. కానీ సక్సెస్ కాలేకపోయింది. చివరిగా మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మంగళవారం సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా పాయల్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

తనను బ్యాన్ చేస్తానని కొందరు నిర్మాతలు బెదిరిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పాయల్. ఈ అమ్మడు నటించిన రక్షణ అనే సినిమా  త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయ్యి ఐదేళ్లు అవుతుంది. ఆ సమయంలోనే పాయల్ కు నిర్మాతకు మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది. పాయల్ సోషల్ మీడియాలో.. ఇలా రాసుకొచ్చింది. నేను 2019-20ల్లో రక్షణ అనే సినిమా చేశాను. దాని ఒరిజినల్ పేరు5 డబ్ల్యూస్. కానీ ఆ సినిమా విడుదల వాయిదా పడింది. ఆ సినిమా మేకర్స్ నా సక్సెస్ ని వాడుకోవాలని చూస్తున్నారు. నాకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు. మిగిలిన పారితోషకం ఇవ్వకుండా నన్ను సినిమా ప్రమోట్ చేయమని బెదిరిస్తున్నారు.అయితే నేను కమిట్ అయిన సినిమాల కారణంగా అందుబాటులో ఉండనని నా టీమ్ చెప్పినా కూడా వినకుండా నన్ను బెదిరిస్తున్నారు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు అని రాసుకొచ్చింది పాయల్.

అయితే దీని పై నిర్మాతలు సీరియస్ అయ్యారు. పాయల్ పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. పూర్తి రెమ్యునరేషన్ తీసుకొని కూడా ఆమె సినిమా ప్రమోషన్స్ కు రావడం లేదు అని ఫిర్యాదు చేశారు.కాగా పాయల్ చెప్పేది నిజామా..? లేక నిర్మాతలు చెప్పేది నిజమా.? అన్నది తెలియాల్సి ఉంది. నిర్మాతల మండలికి ఫిర్యాదు అందంతో ఇప్పుడు పాయల్ లేనిపోనీ కష్టాల్లో ఇరుక్కుంది. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

పాయల్ పై ఫిర్యాదు చేసిన నిర్మాతలు..

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి…