Mahesh Babu- Rajamouli: ఇండియాలోనే టాప్ మోస్ట్ బడ్జెట్‌తో మహేశ్- రాజమౌళి సినిమా.. ఏకంగా అన్ని కోట్లా?
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు ముందే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నాడు. అయితే మహేశ్- రాజమౌళి సినిమా బడ్జెట్‌పై సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిని మించిన సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారట రాజమౌళి.

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో మరోసారి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1100 కోట్లు రాబట్టిన ఈ మూవీకి ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయనున్నాడన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు ముందే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నాడు. అయితే మహేశ్- రాజమౌళి సినిమా బడ్జెట్‌పై సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిని మించిన సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారట రాజమౌళి. మహేశ్‌తో ఒక అడ్వెంచెరస్ స్టోరీతో సినిమా తీయనున్నట్లు ప్రచారం సాగుతోంది. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హాలీవుడ్‌లోని ‘ఇండియానా జోన్స్’ సినిమాల తరహాలో అద్భుతమైన యాక్షన్, అడ్వెంచెరస్ సీన్లతో మూవీని ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్ అడవుల్లో ఈ సినిమాను చిత్రీకరించాలని రాజమౌళి నిర్ణయించుకున్నారట. మహేశ్ సినిమా గ్రాఫిక్స్, సీజీఐ, ఎడిటింగ్ కోసం హాలీవుడ్‌కు చెందిన నైపుణ్యం కలిగిన టెక్నీషియన్ల సహాయం తీసుకుంటున్నారని, అలాగే హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టూడియోతో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారట.
అయితే ముందుగా అనుకున్న దాని కంటే బడ్జెట్ మూడు రెట్లు పెరిగిందని, సినిమా కథలో కొన్ని మార్పులు చేశారని రాజమౌళి అంటున్నారు. ఇండియన్ ఆడియన్స్‌తో పాటు ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ని దృష్టిలో ఉంచుకుని కథను మార్చి, మేకింగ్ కూడా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించేందుకు దర్శక ధీరుడు ప్లాన్ చేస్తున్నారట. మహేష్ బాబు-రాజమౌళి సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్లుగా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. సినిమా ప్రీ-ప్రొడక్షన్‌కి వంద కోట్లు ఖర్చు చేస్తారనే రూమర్స్ కూడా వినిపించాయి. ఇండియాలో ఒక సినిమాకి ఇంత భారీ మొత్తం ఖర్చు చేసిన దాఖాలాలు లేవు. ఒకవేళ ఇదే నిజమైతే మహేశ్- రాజమౌళి సినిమా భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రికార్డులకెక్కనుంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు ఖరం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ సమయంలోనే రాజమౌళితో సినిమాకి సన్నాహాలు మొదలుపెట్టాడు మహేష్ బాబు. రాజమౌళి-మహేష్ బాబు సినిమా షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్ 2024లో ప్రారంభం కానుంది.
దుబాయ్ వెకేషన్ లో బిజీ బిజీగా..
“Dew”ing it in Dubai!!! #TeamMB @MountainDewIn pic.twitter.com/19o6K7Zao8
— Mahesh Babu (@urstrulyMahesh) December 30, 2023
భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో మహేశ్ బాబు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








