- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia Celebrates New Year In London Party, Shares Photos
Tamannaah: లండన్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా.. న్యూ ఇయర్‌కు ఎలా వెల్‌కమ్ చెప్పిందో మీరే చూడండి
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉంది. అక్కడ కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది. తన సన్నిహితులతో కలిసి పార్టీ చేసుకుంది. తనకిష్టమైన ఫుడ్‌ను లాగిస్తూ లండన్ నగరం అందాలను ఆస్వాదించింది.
Updated on: Jan 03, 2024 | 7:33 AM

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉంది. అక్కడ కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది. తన సన్నిహితులతో కలిసి పార్టీ చేసుకుంది. తనకిష్టమైన ఫుడ్‌ను లాగిస్తూ లండన్ నగరం అందాలను ఆస్వాదించింది.

మొదట తన రూమ్‌లో స్నేహితులతో కలిసి పిజ్జా పార్టీ చేసుకున్న మిల్కీ బ్యూటీ ఆ తర్వాత ఐస్‌క్రీం తింటూ లండన్ వీధుల్లో షికార్లు కొట్టేసింది. తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది తమన్నా.

ఇందులో ఎంతో క్యూట్‌గా కనిపించింది తమ్మూ బేబీ. సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఆమె కొన్ని రోజుల పాటు లండన్‌లోనే ఉండనుంది. ప్రస్తుతం తన లండన్ టూర్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది భోళా శంకర్ , జైలర్, లస్ట్ స్టోరీస్ 2 సినిమాల్లో నటించింది తమన్నా. అలాగే జీకర్దా, ఆఖరి సచ్ అనే వెబ్ సిరీసులతో ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించింది.

ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ఆరణ్మణై 4లో నటిస్తోంది తమన్నా. అలాగే ఒక బాలీవుడ్ మూవీలోనూ, కొన్ని వెబ్ సిరీసుల్లోనూ సందడి చేయనుంది.





























