సినీ ఇండస్ట్రీకి కలిసొచ్చిన 2023 డిసెంబర్.. భారీ చిత్రాలతో 2000 కోట్ల బిజినెస్..

సాధారణంగా డిసెంబర్‌ను నాన్ సీజన్ అంటుంటారు.. అందుకే పెద్ద సినిమాలేవీ ఆ నెలలో విడుదల చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా 2023 డిసెంబర్‌లో అయితే బాక్సాఫీస్ దగ్గర ఊచకోతే కనిపించింది. ఈ ఒక్క నెలలోనే ఒకటి రెండు కాదు.. ఏకంగా 2000 కోట్ల బిజినెస్ జరిగింది.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Jan 03, 2024 | 11:28 AM

2023 ఇండియన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. మరీ ముఖ్యంగా ఎండింగ్ అయితే అదిరిపోయింది.. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్‌బస్టర్ అంతే. డిసెంబర్‌లో విడుదలైన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసాయి. యానిమల్‌తో డిసెంబర్ మొదలైతే.. సలార్‌తో సంపూర్ణమైంది. రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ 850 కోట్లకు పైగా వసూలు చేసింది.

1 / 5
ఇక డిసెంబర్ 1నే యానిమల్‌లో పాటు విడుదలైన శామ్ బహదూర్ కూడా 120 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్ ఇందులో హీరోగా నటించారు. నాని హాయ్ నాన్న సైతం 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. శౌర్యు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

2 / 5
మోహన్ లాల్ హీరోగా నటించిన నేరు కూడా మలయాళం ఇండస్ట్రీలో కొత్త రికార్డులు తిరగరాస్తుంది. ఈ చిత్రం కూడా ఇప్పటికే 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక షారుక్ ఖాన్ డంకీ సైతం 320 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడం.. సలార్ ఎదురుగా ఉండటంతో ఊహించిన వసూళ్లు రాలేదు.

3 / 5
డిసెంబర్‌కు పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చిన సినిమా సలార్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓపెనింగ్స్‌లో ఇండియన్ సినిమా రికార్డుల్ని సైతం తిరగరాసింది. ఇప్పటికే 11 రోజుల్లో 600 కోట్లుపైగా వసూళ్లు చేసింది సలార్. 1000 కోట్లకు 400 కోట్ల దూరంలో ఉన్నా.. మరో 10 రోజులు సరైన సినిమాలు లేవు కాబట్టి అది సాధ్యం కావొచ్చు.

4 / 5
చివరిగా డిసెంబర్ 29న విడుదలైన కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రం కూడా బ్లాక్  మొత్తానికి బస్టర్ గా నిలిచింది. ఇది కూడా 100 కోట్లకుపైగా వసూళ్లు చేయవచ్చని అంచనా. డిసెంబర్ అంతా కలిపి 2000 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

5 / 5
Follow us