- Telugu News Photo Gallery Cinema photos Makers who don't hold back on the release of their films for Sankranti festival
Sankranti Movies: పండక్కి ఐదు తెలుగు సినిమాలు.. ఎవరూ వెనక్కి తగ్గేదేలే..
ఎవరికి వాళ్లు మేమొస్తున్నాం అని కన్ఫర్మ్ చేసారు.. పరిస్థితులు చూస్తుంటే ఎవరూ వెనక్కి తగ్గేలా లేరు. నిన్నమొన్నటి వరకు కాస్తైనా కన్ఫ్యూజన్ ఉండేదేమో కానీ ఇప్పుడది కూడా లేదు. నా సామిరంగా రిలీజ్ డేట్ ఖరారవ్వడంతో 2024 పండక్కి రాబోయే సినిమాలపై క్లారిటీ వచ్చేసింది. మరి చివరి నిమిషంలో ఏదైనా పోస్ట్ పోన్ ఊహించొచ్చా..? ట్విస్ట్ ఉంటుందా..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Jan 03, 2024 | 11:59 AM

నా సామిరంగా కూడా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. జనవరి 14న విడుదల కానుంది నాగార్జున మూవీ. దాంతో పండగ సినిమాలన్నింటిపై క్లారిటీ వచ్చేసింది. షూటింగ్స్ కూడా ఇప్పటికే అన్నీ అయిపోయాయి.

చివరి నిమిషంలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారేమో అనుకున్నా.. అదేం జరిగేలా కనిపించడం లేదు. దాంతో జనవరి 12న గుంటూరు కారంతో పండగ సీజన్ షురూ కానుంది.

జనవరి 12న గుంటూరు కారం ఫిక్స్.. పైగా పండగ సినిమాల్లో దీనికే అగ్ర తాంబూలం కూడా. బిజినెస్ పరంగా చూసినా గుంటూరు కారందే అప్పర్ హ్యాండ్. అదే రోజు హనుమాన్ కూడా వస్తున్నాడు. తమ సినిమాను వాయిదా వేసుకొమ్మని ఎవరో బెదిరిస్తున్నారంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కానీ ఎవరేమన్నా మేమొస్తున్నాం అంటున్నారు హనుమాన్ మేకర్స్.

జనవరి 13న రవితేజ ఈగల్, వెంకటేష్ సైంధవ్ విడుదల కానున్నాయి. వీటి షూటింగ్ కూడా ఎప్పుడో అయిపోయింది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు.

పండక్కి రాబోయే సినిమాలన్నింటికీ సాలిడ్ బ్యాగ్రౌండ్ ఉంది ఒక్క హనుమాన్‌కు తప్ప. మొత్తానికి జనవరి 12న గుంటూరు కారం, హనుమాన్.. 13న ఈగల్, సైంధవ్.. 14న నా సామిరంగాతో పండగ సీజన్ హౌజ్ ఫుల్ అయిపోయింది.





























