AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prithviraj: మూగజీవాల మృతి.. జీవనాధారం కోల్పోయిన యువకులు.. స్టార్ హీరోల ఆర్థిక సాయం

తమ కుటుంబాలకు ఏకైక జీవనాధారంగా ఉన్న మూగజీవాల మృతితో జార్జ్ (18), మాథ్యూ (15) తల్లడిల్లిపోయారు. ఆవుల మృతితో కుటుంబమంఆ రోడ్డున పడాల్సి వచ్చింది. అయితే ఈ విషాదం గురించి తెలుసుకున్న మలయాళ నటులు, స్టార్‌ హీరోలు యువకులకు ఆపన్న హస్తం అందించారు. మొదట ప్రముఖ నటుడు, అల వైకుంఠపురం ఫేమ్‌ జయరామ్‌ స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు.

Prithviraj: మూగజీవాల మృతి.. జీవనాధారం కోల్పోయిన యువకులు.. స్టార్ హీరోల ఆర్థిక సాయం
Jayaram, Prithviraj
Basha Shek
|

Updated on: Jan 02, 2024 | 9:32 PM

Share

మలయాళ నటులు మంచి మనసు చాటుకున్నారు. మూగ జీవాల మృతితో జీవనాధారం కోల్పోయిన కుటుంబాలకు తలా కొంత ఆర్థిక సాయం అందజేసి రియల్‌ హీరోలు అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే..కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్‌లో సుమారు 15 ఆవులు మృతి చెందాయి. ఎండిన పచ్చిమిర్చి పొట్టుతో పాటు కలుషితమైన ఆహారం తినడం వల్లే ఆవులు మృతి చెందాయని వార్తలు వస్తున్నాయి. తమ కుటుంబాలకు ఏకైక జీవనాధారంగా ఉన్న మూగజీవాల మృతితో జార్జ్ (18), మాథ్యూ (15) తల్లడిల్లిపోయారు. ఆవుల మృతితో కుటుంబమంఆ రోడ్డున పడాల్సి వచ్చింది. అయితే ఈ విషాదం గురించి తెలుసుకున్న మలయాళ నటులు, స్టార్‌ హీరోలు యువకులకు ఆపన్న హస్తం అందించారు. మొదట ప్రముఖ నటుడు, అల వైకుంఠపురం ఫేమ్‌ జయరామ్‌ స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. రూ. 5లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఆ తర్వాత మమ్ముట్టి కూడా ముందుకు కదిలారు. చిన్నారుల కుటుంబానికి రూ. లక్ష, సలార్‌ నటుడు పృథ్వీరాజ్‌ రూ. 2 లక్షలు ఇస్తారని హమీ ఇచ్చారని జయరామ్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే ఆ డబ్బు కూడా యువకుల కుటుంబాలకు అందజేస్తామన్నారు జయరామ్‌.

కొత్త సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కోసం దాచిన డబ్బుతో.. కాగా ఇక్కడ జయరామ్‌ తన గొప్ప మనసును చాటుకున్నారు. తన కొత్త సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బునే యువకుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందజేసినట్లు నటుడు తెలిపారు. దీంతో మలయాళ నటులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంచి పనిచేశారంటూ కితాబిస్తున్నారు. ఈ విషాదంపై స్పందించిన కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించు రాణి, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్‌ ఆ యువ రైతుల కుటుంబాలను పరామర్శించారు. బీమాతో కూడిన ఐదు ఆవులను రైతులకు అందజేయనున్నట్లు మంత్రి ఇచ్చారు. ఇక తక్షణ సాయంగా రూ. 50,000 అందించారని సమాచారం. కాగా తండ్రి మరణం తర్వాత వీరిద్దరూ సుమారు 3 ఏళ్ల నుంచి ఆవులను పెంచుకుంటున్నారు జార్జ్, మాథ్యూ. చదువుకుంటూనే పశువుల సహాయంతో డెయిరీని నిర్వహిస్తున్నారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆవులు చనిపోవడంతో మాథ్యూ, జార్జ్‌ కుంగిపోయారు. వీరి తల్లి అయితే ఈ బాధను భరించలేక ఆస్పత్రి పాలైంది. గతంలో వీరు రాష్ట్ర ఉత్తమ బాల పాడి రైతులుగా అవార్డులు అందుకున్నారు. ఇడుక్కి ప్రాంతంలో బాగా పేరున్న డైరీ ఫామ్‌లలో వీరిది కూడా ఒకటి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి