AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: ఆ స్టార్ కమెడియన్ దగ్గర దర్శక ధీరుడు రాజమౌళి అసిస్టెంట్‌గా పని చేశారా.?

మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

Rajamouli: ఆ స్టార్ కమెడియన్ దగ్గర దర్శక ధీరుడు రాజమౌళి అసిస్టెంట్‌గా పని చేశారా.?
Rajamouli
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2023 | 9:19 AM

Share

రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగుతోంది. పాన్ ఇండియా డైరెక్టర్ గా రాజమౌళి మంచి పేరు సంపాదించుకున్నారు. మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రాణించిన రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు జక్కన్న. భారీ విజయాన్ని అందుకోవడమే కాదు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో రాజమౌళి సక్సెస్ ఫుల్ డైరెక్టర్. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమానుంచి మొదలు పెట్టి ఆర్ఆర్ఆర్ వరకు ఆయన అన్నీ విజయాలనే అందుకున్నారు. అయితే రాజమోళి కమెడియన్ వేణు మాధవ్ కు అసిస్టెంట్ గా చేశారని మీకు తెలుసా..?

రాజమౌళి వేణుమాధవ్ కు అసిస్టెంట్ గా పని చేయడం ఏంటి..? అని అనుకుంటున్నారా. ఇది నిజజీవితం లో కాదు. ఒక సినిమాలో రాజమౌళి వేణుమాధవ్ కు అసిస్టెంట్ గా కనిపించారు. నితిన్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన సై సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఆ సినిమాలో వేణు మాధవ్ నల్లబాలు పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో రాజమౌళి చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో వేణుమాధవ్ దగ్గర పని చేసే వ్యక్తిగా కనిపించారు జక్కన్న. అంతే కాదు ఇంకా చాలా సినిమాల్లో రాజమోళి చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే.Sye

Sye 1

Sye 1

Follow Us