Samantha Ruth Prabhu; సమంతతో డేటింగ్ రూమర్స్.. స్పందించిన రాజ్ నిడిమోరు భార్య.. ఏమన్నారంటే
అందాల భామ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతుంది. పాన్ ఇండియన్ హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే.. తాను కూడా రేస్ కు రెడీ అంటూ సిద్దమవుతుంది సామ్. మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. సమంతకు తెలుగు, తమిళ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు.

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే ఏడాదిపాటు సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ కొన్ని కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంది. విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
దాంతో ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తుంది. కాగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రాజ్ నిడిమోరు పాపులర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో సమంత, రాజ్ నిడిమోరు కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
ఇక రీసెంట్ గా సమంత నిర్మాతగా చేసిన శుభం సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోల్లో సమంతతో పాటు రాజ్ నిడిమోరు కూడా కనిపించాడు. అంతే కాదు ఓ ఫొటోలో ఫ్లైట్ లో రాజ్ నిడిమోరు భుజంపై తల వాల్చి నవ్వుతూ సెల్ఫీ దిగింది సమంత. దాంతో ఈ ఫోటోల పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ అంటూ వస్తున్న వార్తల పై ఆయన భార్య స్పందించింది. రాజ్ నిడిమోరు భార్య ఓ పోస్ట్ ను షేర్ చేసింది. నా గురించి ఆలోచించే వారు ఉన్నందుకు సంతోషంగా ఉంది. వారికి నేను నా ఆశీర్వాదాలు, ప్రేమను పంపుతున్నా.. ఎవరైతే నా గురించి ఆలోచిస్తున్నారో, నన్ను చూస్తున్నారో, నా గురించి మాట్లాడుకుంటున్నారో, నా గురించి చదువుతున్నారో.. వారందరూ నన్ను కలవండి అంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
