AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: కల్కి థియేటర్‌లో వర్షం.. 4 డీఎక్స్ ఎఫెక్ట్ అంటున్న నెటిజన్స్

ఎక్కడ చూసినా వర్షం నీరే ఉంది. జనం ఇంట్లో నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌తో పాటు.. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాలానగర్‌, నిజాంపేట్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, ఉప్పల్, మలక్‌పేట్, మెహిదీపట్నంతో పాటు.. సిటీ శివారు ప్రాంతాల్లోనూ రాత్రి భారీ వర్షం పడింది

Kalki 2898 AD: కల్కి థియేటర్‌లో వర్షం.. 4 డీఎక్స్ ఎఫెక్ట్ అంటున్న నెటిజన్స్
Kalki 2898ad
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2024 | 11:24 AM

Share

వర్షం కుమ్మేసింది.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం దెబ్బకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా వర్షం నీరే ఉంది. జనం ఇంట్లో నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌తో పాటు.. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాలానగర్‌, నిజాంపేట్‌ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, ఉప్పల్, మలక్‌పేట్, మెహిదీపట్నంతో పాటు.. సిటీ శివారు ప్రాంతాల్లోనూ రాత్రి భారీ వర్షం పడింది. రోడ్లు నదులను తలపించాయి. మోకాళ్లలోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే కల్కి థియేటర్ లోకి వర్షం నీరు చేరింది. ఇందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రచ్చరా సామి..! బోల్డ్ సీన్స్‌తో బుర్రపాడవ్వాల్సిందే.. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

పంజాగుట్టలోని పీవీఆర్ లో కల్కి సినిమా చూస్తుండగా పై నుంచి వర్షపు చినుకులు పడ్డాయి. ఉన్నట్టుండి థియేటర్ లో వర్షం కురవడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆతర్వాత అప్రమత్తమైన యాజమాన్యం సినిమాను ఆపేశారు. దాంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో నెటిజన్ వాటి పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వర్షం పడుతున్న ఫోటోలను షేర్ చేస్తూ.. 4 డీఎక్స్ ఎఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :Anasuya Bharadwaj: మరి వాటిని బూతు అన్నారా..? ఆ విషయం పై మండిపడ్డ అనసూయ..

ఇక కల్కి సినిమా విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఎడి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లు వసూల్ చేసి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకెక్కించింది. ఈ సినిమా చాల భాగాలుగా రానుంది. కల్కి సినిమాలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపించాడు. అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా దీపికా పదుకొనె , దిశా పటని హీరోయిన్స్ గా కనిపించారు. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.