Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలైంది.. ఫొటోలు షేర్ చేసిన రహస్య గోరఖ్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన మొదటి హీరోయిన్ రహస్య గోరఖ్ తో కలిసి మరికొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. ఇందుకోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం (ఆగస్టు 22) కర్ణాటకలోని కూర్గ్ లో కిరణ్, రహస్యల వివాహం జరగనుంది.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన మొదటి హీరోయిన్ రహస్య గోరఖ్ తో కలిసి మరికొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. ఇందుకోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం (ఆగస్టు 22) కర్ణాటకలోని కూర్గ్ లో కిరణ్, రహస్యల వివాహం జరగనుంది. ఇప్పటికే వధూ వరులతో పాటు పెళ్లి బృందం కూడా అక్కడకు చేరుకుంది. వివాహానికి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వధూవరులిద్దరూ బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారీ ప్రేమ పక్షులు. అలా తాజాగా కాబోయే పెళ్లి కూతురు రహస్య కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమెతో పాటు కాబోయే వరుడు హీరో కిరణ అబ్బవరం పెళ్లి దుస్తుల్లో మురిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు ముందుగానే అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్..
అంతకు ముందు కిరణ్ అబ్బవరం ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ‘ నా లేటెస్ట్ మూవీ ‘క’ నుంచి రిలీజైన వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో నా పాటలన్నింటికీ ఎప్పుడూ మంచి రెస్పాన్స్ వచ్చేది. కానీ ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. ఇంత మంచి పాటను మాకు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ గారికి ధన్యవాదాలు. పాట రాసిన ఆయన నా ఫ్రెండ్ అన్ని షార్ట్ ఫిలిమ్స్‌కి నాతో పాటు ఉన్నారు. నా మొదటి సినిమాలో రాజావారు రాణి గారు ఒకటవుతారని కూడా రాశారు. అలా ఎల్లుండే (ఆగస్టు 22) నా పెళ్లి కూడా జరగబోతుంది. మా డైరెక్టర్‌కు థాంక్యూ. వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ పాట అందరికీ నచ్చుతుంది. ఈ పాట ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.
కిరణ్ అబ్బవరం షేర్ చేసిన వీడియో..
Thank you all ☺️🙏#WorldofVasudev #KA pic.twitter.com/RDQauPl5PN
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 20, 2024
కొత్త అధ్యాయం ప్రారంభం..
A New Journey Begins….@Kiran_Abbavaram 😍#KiranRahasya #KiranAbbavaram pic.twitter.com/DTO60y2rKz
— Kakinada Talkies (@Kkdtalkies) August 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








