Prabhas: అభిప్రాయం చెప్పడానికి ఓ పద్దతి పాడు ఉంటాయ్.. చాలా జెలసీ ఉందని తెలుస్తోంది.. డైరెక్టర్ అజయ్ భూపతి సీరియస్..
ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా అసలు బాగలేదని.. ఇందులో డార్లింగ్ లుక్ తనకు నచ్చలేదని.. ప్రభాస్ జోకర్ లా కనిపించాడంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి. అతడి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్, టాలీవుడ్ సెలబ్రెటీస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాన్ ఇండియా రారాజు.. బాక్సాఫీస్ కింగ్ అంటూ అభిమానులు రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అతడితో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి షేక్ చేసిన ఆ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు. వరుస ప్లాపులతో అభిమానులు నిరాశ చెందుతున్న వేళ ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మరోసారి సంచలనం సృష్టించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ అభిమానులుగా మారిపోయిన హీరో. కానీ కొందరు బాలీవుడ్ స్టార్స్ మాత్రం డార్లింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా అసలు బాగలేదని.. ఇందులో డార్లింగ్ లుక్ తనకు నచ్చలేదని.. ప్రభాస్ జోకర్ లా కనిపించాడంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి. అతడి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్, టాలీవుడ్ సెలబ్రెటీస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా బాగలేదని చెప్పడం.. ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ప్రభాస్ వంటి గోల్డెన్ వ్యక్తిని ఇలా అనడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో సుధీర్ బాబు స్పందిస్తూ అర్షద్ వర్సి వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటరిచ్చారు. అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి సైతం సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. ప్రభాస్ జోకర్ లా ఉన్నాడంటూ అర్షద్ వర్సి చేసిన కామెంట్స్ పై ఆసక్తికర ట్వీట్ చేశాడు.
“#ప్రభాస్.. భారతీయ సినిమాని ప్రపంచ ప్రేక్షకులకు తీసుకెళ్లడానికి ప్రతిదీ అందించిన, ఏదైనా చేయగల వ్యక్తి. అలాంటి మనిషి మన జాతికే గర్వకారణం. ఆ చిత్రంపై, అలాగే అతడిపై మీ దృష్టిలో అసూయను మేము చూస్తున్నాం. ఆయన సినిమాల పట్ల మీకున్న జెలసీ కనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని చెప్పడానికి ఒక పరిమితి, ఒక పద్దతి ఉంటుంది. అలాగే మీరు ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కూడా కనిపిస్తుంది” అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం అర్షద్ వర్సి చేసిన కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
#Prabhas is the man who has given everything & will do anything to take Indian Cinema to the world audience, a Pride of our nation.
We can see the jealousy on that film, on him in your eyes just because you've faded out & no one gives an eye to you.
There's a limit & a way to…
— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




