AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jigarthanda DoubleX: భారీ అంచనాల మధ్య వచ్చిన ‘జిగర్తండ డబుల్‌ ఎక్స్’ సినిమా ఎలా ఉందంటే

పర్ఫెక్ట్ హిట్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు రాఘవ లారెన్స్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఎస్‌.జె.సూర్య. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారనగానే ప్రేక్షకుల్లో ఎక్స్ పెక్టేషన్స్ మెండుగా కనిపించాయి. ఆల్రెడీ జనాల మెప్పు పొందిన జిగర్తాండ సీక్వెల్‌లో వీరిద్దరూ నటిస్తున్నారనగానే, కాస్త అటెన్షన్‌ పెరిగింది. డైరక్టర్‌ కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం క్యూరియస్‌గానే వెయిట్‌ చేశారు.

Jigarthanda DoubleX: భారీ అంచనాల మధ్య వచ్చిన  'జిగర్తండ డబుల్‌ ఎక్స్' సినిమా ఎలా ఉందంటే
Jigarthanda Doublex
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Nov 10, 2023 | 6:24 PM

Share

పర్ఫెక్ట్ హిట్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు రాఘవ లారెన్స్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఎస్‌.జె.సూర్య. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారనగానే ప్రేక్షకుల్లో ఎక్స్ పెక్టేషన్స్ మెండుగా కనిపించాయి. ఆల్రెడీ జనాల మెప్పు పొందిన జిగర్తాండ సీక్వెల్‌లో వీరిద్దరూ నటిస్తున్నారనగానే, కాస్త అటెన్షన్‌ పెరిగింది. డైరక్టర్‌ కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం క్యూరియస్‌గానే వెయిట్‌ చేశారు. మరి శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా అందరి మన్ననలూ పొందిందా? మెప్పించిందా?…

నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్‌.జె.సూర్య, షైన్‌ టామ్‌ చాకో, నిమిషా సజయన్‌, నవీన్‌ చంద్ర, సత్యన్‌, అరవింద్‌ ఆకాష్‌, ఇళవరసు తదితరులు

కెమెరా: ఎస్‌. తిరునావుక్కరసు

ఎడిటర్‌: షఫీ మొహమ్మద్‌ అలీ

స్టంట్స్: దిలీప్‌ సుబ్బరాయన్‌

సంగీతం: సంతోష్‌ నారాయణ్‌

నిర్మాతలు: కార్తికేయన్‌ సంతానం, ఎస్‌.కదిరేశన్‌

దర్శకత్వం: కార్తిక్‌ సుబ్బరాజ్‌

కథ

అలియాస్‌ సీజర్‌ (రాఘవ లారెన్స్) కర్నూలులో గ్యాంగ్‌స్టర్‌. ఎమోషన్స్ కి లొంగని కరుడుగట్టిన వ్యక్తి. క్లింట్‌ ఈస్ట్ వుడ్‌కి వీరాభిమాని. నలుపు రంగున్న తొలి ఇండియన్‌ హీరోగా తన పేరు కలకాలం నిలవాలని అనుకుంటాడు. తనకోసం కథలు సిద్ధం చేయమని దర్శకులకు కబురుపెడతాడు. అది విన్న రే దాసన్‌ కూడా సినిమా తీయాలనుకుంటాడు. పాండ్య పేరుతో ఈ బొమ్మ దద్దరిల్లాలన్నది అలియాస్‌ సీజర్‌ కోరిక. ఎవరి కథతోనో ఎందుకు సినిమా తీయడం, అలియాస్‌ సీజర్‌ స్వీయ చరిత్రనే సినిమాగా తీస్తానని చెబుతాడు రే దాసన్‌. ఆ క్రమంలో అలియాస్‌ సీజర్‌ గురించి అంతా తెలుసుకుంటాడు. ఆ ప్రయాణంలో అతనికి చాలా విషయాలు తెలుస్తాయి. అలియాస్‌ సీజర్‌కి, అతని భార్య (నిమిషా)కి తరచూ గొడవలవడాన్ని కూడా గమనిస్తాడు రే దాసన్‌. సీజర్‌ భార్యకు సీమంతం జరిగే సమయానికి వాళ్లందరూ పెద్దాయనగా భావించే ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. ఆ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని ఆరా తీస్తాడు సీజర్‌. ఇంతలో సీజర్‌తో తాను సినిమా చేయలేకపోతున్నానని చేతులెత్తేస్తాడు రేదాసన్‌. సినిమా పూర్తి చేయాలంటే, తాను చెప్పినట్టు చేయాలని సలహా ఇస్తాడు. అలియాస్‌ సీజర్‌ని, అతని సొంతూరికి తీసుకెళ్తాడు. అక్కడ రే దాసన్‌ చెప్పినట్టే ప్రవర్తిస్తాడు సీజర్‌. కొందరికి కాపాడుతాడు సీజర్‌. ఆ క్రమంలో అక్కడ అడవిలో తమ కుటుంబాలకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తిని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంలోకి సీఎం ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు రే దాసన్‌ ఎవరు? అలియాస్‌ సీజర్‌ జీవితాన్ని సినిమాగా చేయడమే అతని ఉద్దేశమా? లేకుంటే, గతంలో సీజర్‌తో ఏవైనా గొడవలున్నాయా? పగ తీర్చుకోవడానికి డైరక్టర్‌ వేషం వేశాడా? ఫారెస్ట్ లో ఉన్న పోలీస్‌ ఆఫీసర్‌ దుశ్చర్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టిందెవరు? ఈ మొత్తం కథతో ఇద్దరు సినిమా హీరోలకు ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి అంశాల చుట్టూ సినిమా నడుస్తుంది.

విశ్లేషణ

జిగర్తండ డబుల్‌ ఎక్స్ ట్రైలర్‌ చాలా మందిలో ఆసక్తి రేకెత్తించింది. సినిమా బావుంటుందనే అంచనాలు పెంచింది. కార్తిక్‌ సుబ్బరాజ్‌ టేకింగ్‌ అదిరిపోతుందని అనుకున్నారు. ట్రైలర్‌లో కనిపించినట్టే, సినిమాలోనూ గెటప్పులన్నీ కొత్తగా ఉన్నాయి. అడవి ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవితాలు, ఏనుగులు, వేటాడటం, అధికారుల దాహానికి ఆటవిక ప్రజలు బలైపోయే తీరు, వ్యక్తుల మధ్య ఉన్న ఈగోలు…. ఇలాంటి విషయాలన్నిటినీ టచ్‌ చేశారు. అయితే దేనికదే విడిగా ఉండటంతో, ఎక్కడా కనెక్టివిటీ కనిపించలేదు. పైగా చెప్పిందే చెబుతూ, సాగదీసే సన్నివేశాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. కెమెరా, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ వీక్‌ అయింది. అసలు సినిమాలో ఏం చెప్పాలనుకున్నారనే విషయం మీద క్లారిటీ కనిపించలేదు. పోనీ, జనాలు కడుపుబ్బ నవ్వే సన్నివేశాలున్నాయా? అంటే అదీ లేదు. రకరకాల కేరక్టర్లు రావడం, పోవడం తప్ప, దేనికీ పర్పస్‌ కనిపించదు. ఏనుగులను చంపడాన్ని స్క్రీన్‌ మీద చూపించినప్పుడు కూడా ఆడియన్స్ కనెక్ట్ కారు. పైగా అదేదో అనవసరమైన విషయం అన్నట్టు విసుగ్గా కదులుతున్నారు థియేటర్లలో. సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం, చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్‌గా చెప్పలేకపోవడం, కథా గమనంలో ఆసక్తిని రేకెత్తించలేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌. సినిమా కలర్‌, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అన్నీ పీరియాడిక్‌ టచ్‌తో ఉంటాయి. కానీ సినిమాలో మాత్రం ప్యాన్‌ ఇండియా కాన్సెప్టుల ప్రస్తావన ఉంటుంది. ఎస్‌.జె.సూర్య, లారెన్స్, నిమిషా తమ పాత్రల్లో చాలా బాగా ఒదిగిపోయారు. వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయింది. ప్రొడక్షన్‌ వేల్యూస్‌, లొకేషన్లు బావున్నప్పటికీ, అవేవీ సినిమాకు ప్లస్‌ కాలేకపోయాయి.

ఫైనల్‌గా…

మెప్పించలేకపోయిన జిగర్తండ డబుల్‌ ఎక్స్!