Jigarthanda Double X Twitter Review: ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ ట్విట్టర్ రివ్యూ.. ఎక్సలెంట్ డైరెక్షన్..

పిజ్జా, జిగర్ తండా చిత్రాలతో ఫేమస్ అయిన కార్తిక్.. ఇప్పుడు జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం 2015 సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కి సీక్వెల్. ఈ సినిమా కొనసాగింపు కాదని, గ్యాంగ్‌స్టర్ డ్రామా తరహాలోనే కాన్సెప్ట్ ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశారు. ఇందులో నిమిషా సజయన్ , సంచనా నటరాజన్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు.

Jigarthanda Double X Twitter Review: 'జిగర్ తండా డబుల్ ఎక్స్' ట్విట్టర్ రివ్యూ.. ఎక్సలెంట్ డైరెక్షన్..
Jigarthanda 2 Movie OTT
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 10, 2023 | 9:16 AM

డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే.సూర్య, రాఘవ లారెన్స్ కాంబోలో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం జిగర్ తండా డబుల్ ఎక్స్. ప్రయోగాత్మాక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతకు ముందు పిజ్జా, జిగర్ తండా చిత్రాలతో ఫేమస్ అయిన కార్తిక్.. ఇప్పుడు జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం 2015 సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కి సీక్వెల్. ఈ సినిమా కొనసాగింపు కాదని, గ్యాంగ్‌స్టర్ డ్రామా తరహాలోనే కాన్సెప్ట్ ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశారు. ఇందులో నిమిషా సజయన్ , సంచనా నటరాజన్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు. దీపావళి కానుకగా ఈరోజు (నవంబర్ 10న) ఈ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే జిగర్ తండా ఫస్ట్ షో చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు.

ఈ సినిమాకు అదిరిపోయిందని. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ బాగుందని.. ఈ సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేశామని అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. సినిమాలోని ప్రతి పాత్ర అద్భుతమని.. ఈ సినిమా సూపర్ హిట్ అంటూ ట్వీట్ చేశాడు మరో నెటిజన్స్. ఇక ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధనుష్ సైతం విషెస్ అందించాడు. ఈ సినిమా అదిరిపోయేలా ఉందని. జిగర్ తండా చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందంటూ కామెంట్స్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.