Japan Twitter review: ‘జపాన్’ ట్విట్టర్ రివ్యూ.. మరోసారి టాలీవుడ్ అడియన్స్ ముందుకు కార్తి..

జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఇందులో కార్తి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే తెలుగులో ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో మరింత కేర్ తీసుకున్నారు కార్తి. ఈ సినిమా దీపావళి కానుకగా ఈరోజు (నవంబర్ 10న) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ఫస్డ్ డే షో అయిపోయింది.

Japan Twitter review: 'జపాన్' ట్విట్టర్ రివ్యూ.. మరోసారి టాలీవుడ్ అడియన్స్ ముందుకు కార్తి..
Japan Movie Twitter Review
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 10, 2023 | 8:43 AM

కోలీవుడ్ హీరో కార్తికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. యుగానికి ఒక్కడు, ఊపిరి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆయన నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కార్తి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జపాన్. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఇందులో కార్తి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే తెలుగులో ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో మరింత కేర్ తీసుకున్నారు కార్తి. ఈ సినిమా దీపావళి కానుకగా ఈరోజు (నవంబర్ 10న) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ఫస్డ్ డే షో అయిపోయింది. ఈ సినిమాను చూసిన అడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుందని.. కార్తి తన పాత్రలో అద్భుతంగా నటించాడని అంటున్నారు. సెకండాఫ్ సూప్ర్ అని.. జీవీ ప్రకాష్ అందించిన బీజీఎం నెక్ట్స్ లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజువల్స్ పరంగా సినిమా అదుర్స్ అంటున్నారు. అలాగే ఇందులో కార్తి, అను కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తోందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.