Radisson Drugs Case: హైకోర్టులో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న క్రిష్
రీసెంట్ డ్రగ్స్ వినియోగం కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరు బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఆయన పార్టీకి అటెండ్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో ఆయన్ను పోలీసులు ఎంక్వైరీకి పిలిచి.. బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించారు. ఆ రిపోర్టుల్లో కొకైన్ నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది.

హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులు పరారీలో ఉండడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయగానే.. నిందితుడు నీల్ రాత్రికి రాత్రే విదేశాలకు చెక్కేసినట్లు తెలుస్తోంది. దాంతో.. నీల్‌పై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
మరో నిందితుడు కేదార్‌పైనా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే.. కేదార్ ఇప్పటికే గచ్చిబౌలి పోలీసుల ముందు హాజరై బెయిల్‌పై బయటకు వచ్చాడు. దాంతో.. కేదార్.. దేశం వదిలి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదే కేసుకు సంబంధించి పరారీలో ఉన్న శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమెకు కూడా నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. ఈ కేసులో నిందితులుగా ఉన్న లిషి, సందీప్ ఆదివారం రాత్రి పోలీసుల ఎదుట హాజరైయ్యారు. వాళ్ల ఇద్దరి యూరిన్, బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
హైకోర్టులో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న క్రిష్
ఈ డ్రగ్స్ పార్టీలో దర్శకుడు క్రిష్ కూడా ఉండటంతో అందరూ కంగుతిన్నారు. పార్టీలో అతను కూడా ఉన్నట్లు నిర్ధారణ కాగానే విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. తొలుత సరేనన్న క్రిష్.. ముంబైలో ఉన్నానని 2 రోజులు టైమ్ కావాలని కోరాడు. అంతలోనే తనను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై విచారణ జరుగుతుండగానే.. క్రిష్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. యూరిన్, బ్లడ్ శాంపిల్స్ సైతం ఇచ్చాడు. టెస్టుల్లో నెగిటివ్ అని తేలినట్లు సమాచారం. దీంతో క్రిష్.. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు అతడి తరఫు న్యాయవాది హైకోర్టుకు సమాచారం ఇచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




