Kamal Haasan: ఆ విషయంలో ఇబ్బంది పెట్టేవారు.. కమల్ హాసన్ పై రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..

కారవాన్‌లోని రహస్య కెమెరాలు పెట్టి మహిళలు బట్టలు మార్చుకోవడం వీడియోలు తీసి ఆ తర్వాత కొందరు మగాళ్లు ఆ వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేసిన సంఘటనలు తాను చూశానని, గుంపులుగా కూర్చున్న మగ సిబ్బంది ఆ వీడియోలను చూశారని రాధిక వెల్లడించారు. రాధికా చేసిన కామెంట్స్ తర్వాత దాని పై ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టింది. ఇప్పుడు రాధిక చెప్పిన మరో విషయం అందరిని షాక్ అయ్యేలా చేసింది.

Kamal Haasan: ఆ విషయంలో ఇబ్బంది పెట్టేవారు.. కమల్ హాసన్ పై రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్..
Radhika Sarath, Kamal Haasa
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 03, 2024 | 12:12 PM

హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత చాలా మంది అలనాటి నటీమణులు ఆరోపణలతో ముందుకు వస్తున్నారు. యంగ్ హీరోయిన్స్ నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు అందరూ తమకు ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడుతున్నారు.  అయితే మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు ఇలాంటి ఘటనలు ఇతర భాషల్లోనూ జరుగుతున్నాయని పలువురు నటీమణులు అంటున్నారు. ఇతర సినిమా రంగాల్లో కూడా మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, అయినా కూడా ఎవరూ నోరు విప్పరని నటీనటులు తెలుపుతున్నారు. సౌత్ ఇండియన్ సినిమా సీనియర్ నటీమణులలో ఒకరైన రాధిక శరత్ కుమార్ ఇటీవల చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేశాయి. ఆమె పలు భాషల్లో నటించారు. అందుకే సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో తనకు తెలుసని ఆమె అన్నారు.

కారవాన్‌లోని రహస్య కెమెరాలు పెట్టి మహిళలు బట్టలు మార్చుకోవడం వీడియోలు తీసి ఆ తర్వాత కొందరు మగాళ్లు ఆ వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేసిన సంఘటనలు తాను చూశానని, గుంపులుగా కూర్చున్న మగ సిబ్బంది ఆ వీడియోలను చూశారని రాధిక వెల్లడించారు. రాధికా చేసిన కామెంట్స్ తర్వాత దాని పై ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టింది. ఇప్పుడు రాధిక చెప్పిన మరో విషయం అందరిని షాక్ అయ్యేలా చేసింది. కొన్నాళ్ల క్రితం ఆమె చేసిన కామెంట్స్  ఇప్పుడు వైరల్‌గా మారాయి. ముద్దు సన్నివేశాల్లో నటించి పేరు తెచ్చుకున్న ఓ నటుడు తనను, తన కోడలను ముద్దుల సన్నివేశంలో నటించమని బలవంతం చేశాడని ఆమె అన్నారు. ఆయన ఎవరో కాదు యూనివర్సల్ హీరో కమల్‌హాసన్‌. ఆయన పై రాధిక సంచలన ఆరోపణలు చేశారు.

కమల్ హాసన్ సినిమాల్లో సాధారణంగా ముద్దుల సన్నివేశాలు ఉంటాయి. యూత్‌ని ఎట్రాక్ట్ చేసేందుకు నిర్మాతలు, దర్శకులు ఇలాంటి సన్నివేశాలను సినిమాల్లో ఉంచడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు కమల్ హాసన్ సినిమాల్లో ముద్దుల సన్నివేశాలు ఉండాలనేది రూల్ గా ఉండేది. కొంతమంది నటీమణులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ముద్దు సన్నివేశాల్లో నటిస్తారు. అయితే మరికొంతమంది మాత్రం ఆ సన్నివేశాలకు భయపడి కమల్ హాసన్ సినిమాల్లో నటించరు. ఇలాంటి ముద్దుల సీన్లలో నటించడానికి ఇష్టపడక పోవడంవల్లే సిప్పీండీ ముత్ సినిమా తర్వాత ఆయనతో సినిమాల్లో నటించడం మానేశాను అని రాధికా అన్నారు.

ఆయన సినిమాల్లో ముద్దుల సన్నివేశంలో పెదాలను నొక్కి ముద్దులు పెట్టేవాడు. నేనే కాదు మా కోడలిని కూడా ఇలా హింసించారు. కానీ నేను దానిని ఆపినప్పుడు, కొంతమంది నా పై వ్యతిరేకత చూపారు. తర్వాత చాలా అవకాశాలు చేజారిపోయాయి’ అని రాధిక తెలిపారు. ముద్దుల సన్నివేశంవిషయంలో  కమల్‌హాసన్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నటి రేఖ గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదునే చేసింది. సినిమాలో తనకు చెప్పకుండానే ముద్దు సన్నివేశాలు పెట్టారని, కమల్ హాసన్ తనను బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని ఆమె చెప్పింది. ఇక ఇప్పుడు రాధికా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.