AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్కిలో నటించిన ఈ చిన్నది మామూల్ది కాదుగా..! అమ్మడి టాలెంట్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు దర్శకులు కూడా ఈ సినిమాలో నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఆర్జీవీ, రాజమౌళి, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలా మంది ఈ సినిమాలో కనిపించారు.

కల్కిలో నటించిన ఈ చిన్నది మామూల్ది కాదుగా..! అమ్మడి టాలెంట్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
Kalki 2898ad
Rajeev Rayala
|

Updated on: Sep 03, 2024 | 11:46 AM

Share

కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి వెయ్యికోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. బాహుబలి సినిమా తర్వాత కల్కి ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు దర్శకులు కూడా ఈ సినిమాలో నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఆర్జీవీ, రాజమౌళి, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలా మంది ఈ సినిమాలో కనిపించారు. అలాగే శోభన, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను పలు పార్ట్స్‌గా తెరకెక్కించనున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.

కల్కి సినిమా థియేటర్స్ లో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ఆకట్టుకుంటుంది. కల్కి 2898ఏడీ  సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో కల్కి హిందీ వర్షన్, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇతర భాషల్లో కల్కి సినిమా అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలా మంది కొత్త నటీనటులు కనిపించారు. కాగా కల్కి సినిమాలో కాంప్లేక్స్ లో దీపికా పడుకునేకు సాయం చేసిన నటి గుర్తుందా.?

ఆమె ఎవరో తెలుసా.? కల్కి సినిమా చూసిన చాలా మంది ఈ అమ్మడు ఎవరు అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు. చిన్న పాత్రే అయినా బాగా ఆకట్టుకుంది ఈ యాక్టర్. ఆమె పేరు కావ్య రామచంద్రన్. కేరళలో పుట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత ఫ్యామిలీతో చెన్నై కు షిఫ్ట్ అయ్యింది. ఇక ఈ అమ్మడు నటి మాత్రమే కాదు ప్రొఫిషనల్ స్విమ్మర్ కూడా.. అలాగే విద్యావేత్త, థియేటర్ ఆర్టిస్ట్ ఈ అమ్మడు. అలాగే చాలా యాడ్స్ లో నటించింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్, తనిష్క్, క్యారెట్ లేన్, మింత్ర, కర్లాన్, మిల్కీ బికిస్ యాడ్స్ లో మెరిసింది. అలాగే బ్రూ యాడ్‌లోనూ కనిపించింది. వీటితో పాటు బెంగళూరులోని ఒక ఎన్జీవోలో ఏడాదిపాటు పనిచేసింది. అలాగే సుఖా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే ఎన్జీవోకి సహ వ్యవస్థాపకురాలు కూడా కావ్య రామచంద్రన్. ఇక కల్కి సినిమాలో అవకాశం అందుకున్న ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్