Pushpa Movie : మలయాళంలో అల్లు అర్జున్ ‘పుష్ప’ దండయాత్ర కాస్త ఆలస్యం.. కారణం ఇదే..

పుష్ప రాజ్‌... రీసౌండ్ చేస్తున్నాడు. థియేటర్లలో జనాలను ఊగిపోయేలా చేస్తున్నాడు. మంచి నాన్‌వెజ్‌ తిన్న ఫీల్‌ను బన్నీ ఫ్యాన్స్‌కు కలిగిస్తున్నాడు

Pushpa Movie : మలయాళంలో అల్లు అర్జున్ 'పుష్ప' దండయాత్ర కాస్త ఆలస్యం.. కారణం ఇదే..
Bunny
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 17, 2021 | 1:05 PM

Pushpa Movie : పుష్ప రాజ్‌… రీసౌండ్ చేస్తున్నాడు. థియేటర్లలో జనాలను ఊగిపోయేలా చేస్తున్నాడు. మంచి నాన్‌వెజ్‌ తిన్న ఫీల్‌ను బన్నీ ఫ్యాన్స్‌కు కలిగిస్తున్నాడు. అవును అందుకు సినీ అభిమానులు ఈ సినిమా టికెట్ల కోసం మార్నంగ్ నుంచే పోటీ పడుతున్నారు. థియేటర్ల ముందు చేరి.. ఫుల్ హంగామా చేస్తున్నారు. ఇక ఇంకొంత మంది బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ సినిమా చూసేందుకు థియేటర్ గేట్లను నెట్టుకుని మరీ సినిమా హాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు బన్నీ కటౌట్‌ ముందు జాతర చేస్తున్నారు. క్షీరాభిషేకాలు.. టపాసుల మోతలు.. పూల దండలు.. ఇలా అల్లు అండ్ మెగా ఫ్యాన్స్ తన బన్నీ మీదున్న అభిమానాన్ని క్రేజీగా చాటుకుంటున్నారు. అభిమానంలో తగ్గేదేలే అంటూ తమ చేష్టలతో చెప్పేస్తున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప 5 భాషల్లో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ మలయాళం లో మాత్రం రిలీజ్ కాలేదని టాక్ వినిపిస్తుంది. అనుకోని కారణాల వల్ల మలయాళ వర్షన్ ను రిలీజ్ చేయలేదట. మలయాళం ప్లేస్ లో తమిళ్ వర్షన్ ను రిలీజ్ చేశారట మేకర్స్ . దాంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. బన్నీకి మలయాళంలో భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దాంతో అల్లు అర్జున్ అభిమానులకు మేకర్స్ క్షమాపణలు చెప్పారని తెలుస్తుంది. రేపు (డిసెంబర్ 18న ) మలయాళ వర్షన్ ను విడుదల చేయనున్నారట. ప్రింట్ లను సకాలంలో అందకపోవడంతో షో పడలేదని తెలుస్తుంది ఇక రేపు సినిమాను వీక్షించేందుకు బన్నీ ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. దీనివల్ల షోలు 18వ తేదీ నుండి మాత్రమే ప్రారంభమవుతాయని  గుసగుస వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: పుష్ప సినిమాపై స్పందించిన మెగా పవర్‌స్టార్‌.. ట్విట్టర్లో ఏం చెప్పారంటే..

Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..

Vishal : ‘ఎనిమి’ కాంబో రిపీట్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న విశాల్ 33.. దర్శకుడు ఎవరంటే.