సంధ్య థియేటర తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. మంగళవారం (జనవరి 08) అల్లు అర్జున్ స్వయంగా కిమ్స్ ఆస్పత్రికి వచ్చి బాలుడిని పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. అలాగే పిల్లాడి తండ్రికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. బన్నీ వచ్చి వెళ్లిపోయిన తర్వాత మరోసారి శ్రీ తేజ్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు కిమ్స్ డాక్టర్లు. పిల్లాడికి అందుతున్న చికిత్స గురించి మరిన్ని అప్డేట్స్ అందించారు. ‘శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుట పడుతోంది. అతను క్రమంగా కోలుకుంటున్నాడు. యాంటి బయోటిక్స్ కూడా ఆపేశాం. కానీ ఇంకా వెంటిలేటర్‌పైనే శ్రీ తేజ్ చికిత్స కొనసాగుతుంది’ అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి హెల్త్ బులెటిన్ లో ఇవి మాత్రమే చెప్పుకొచ్చారు వైద్యులు. మరోవైపు శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. కాగా మంగళవారం అల్లు అర్జున్‌తోపాటు తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు శ్రీ తేజ్ ను పరామర్శించారు. పిల్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి కిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. అనంతరం శ్రీతేజ్ కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ అండగా నిలిచింది. ఇప్పటికే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ.1 కోటి, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ చెరో రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందించారు.
#AlluArjun visited #SriTej, the victim of the Sandhya Theatre incident, at KIMS Hospital today. With all police permissions in place. pic.twitter.com/hEQrHxppfi
— Vamsi Kaka (@vamsikaka) January 7, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.