AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు’.. వారికి అల్లు అర్జున్ వార్నింగ్

అల్లు అర్జున్ అలాగే పుష్ప 2 సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ తన అభిమానులను ఉద్దేశించి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. అలాగే నెగెటివ్ పోస్టులు షేర్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Allu Arjun: 'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. వారికి అల్లు అర్జున్ వార్నింగ్
Allu Arjun
Basha Shek
|

Updated on: Dec 22, 2024 | 4:27 PM

Share

సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ తో పాటు సినిమా ఇండస్ట్రీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం వ్యాఖ్యలకు స్పందించిన అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టార9ఉ. సంధ్య థియేటర్ ఘటన యాక్సిడెంట్ అని, అందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించి కొంత మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించాడు అల్లు అర్జున్. ఫ్యాన్స్ ముసుగులో పోస్టులు చేస్తోన్న వారికి తన అభిమానులు దూరంగా ఉండాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ‘నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్త పరచాలి. ఎవరినీ వ్యక్తిగతంగా కించ పరిచే విధంగా పోస్టులు షేర్ చేయవద్దని నా విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీలు, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు షేర్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నెగెటివ్ పోస్టులు షేర్ చేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’ అని అల్లు అర్జున్ కోరారు.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు అల్లు అర్జున్ , మోహన్ బాబు ఘటనలపై డీజీపీ జితేందర్ స్పందించారు. ‘ మేం అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకం కాదు. చట్టప్రకారం మేం యాక్షన్ తీసుకున్నాం. అరోజు జరిగిన సంఘటన దురదృష్టకరం.. ఇక సినీ ‌నటుడు మోహన్ బాబు పై‌ కేసు నమోదు చేసాం. మోహన్ బాబుది వారి కుటుంబ సభ్యుల సమస్యలు. మీడియా ప్రతినిధులపై దాడుల నేఫధ్యంలో లా ప్రకారం మోహన్ బాబు మీద యాక్షన్ ఉంటుంది.

అల్లు అర్జున్ పోస్ట్..

ఢిల్లీలో అల్లు అర్జున్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి