OTT: ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు రానుంది. ఇటీవలే తమిళంలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వస్తోంది.
తమిళ సినిమా ఇండస్ట్రీలో ఆర్జే బాలాజీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా సినిమాల్లో కమెడియన్ గా కనిపించిన అతను ఇప్పుడు హీరోగా, డైరెక్టర్ గా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరో సూర్యతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడీ మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇదిలా ఉంటే ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సొర్గవాసల్. సిద్దార్థ్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో సానియా ఇయప్పన్, సెల్వరాఘవన్, కరుణాస్, నట్టి సుబ్రమణ్యం, షరాఫ్ యు ధీన్, బాలాజీ శక్తివేల్, రవి రాఘవేంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 29న థియేటర్లలో విడుదలైన సొర్గవాసల్ సూపర్ హిట్ గా నిలిచింది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ తో కూడిన కథా కథనాలు కోలీవుడ్ ఆడియెన్స్ ను బాగా మెప్పించాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన సొర్గవాసల్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా సినిమా స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చింది. డిసెంబర్ 27 నుంచి సొర్గవాసల్‌ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.
స్వైప్ రైట్ స్టూడియోస్, థింక్ స్టూడియోస్ బ్యానర్లపై సిద్ధార్థ్ రావ్, పల్లవి సింగ్ సంయుక్తంగా సొర్గవాసల్ సినిమాను నిర్మించారు. క్రిస్టో జేవీయర్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో హీరో రోడ్డు పక్కన ఒక ఫుడ్‌స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. అతనికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ తో స్నేహం ఏర్పడుతుంది. ఆ చొరవతో తనకు లోన్ ఇప్పించమని కోరుతాడు. అలా లోన్ సాంక్షన్ లెటర్ తీసుకునేందుకు ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో ఆ అధికారి హత్య జరుగుతుంది. దీంతో హీరోను నిందితుడిగా భావించి జైల్లో వేస్తారు.మరి ఆ ఐఏఎస్ అధికారిని ఎవరు చంపారు? హీరోను కావాలని జైలుకు పంపించిందెవరు? తర్వాత ఎలా బయటకు వచ్చాడు? అనేది తెలియాలంటే సొర్గవాసల్ సినిమాను చూడాల్సిందే.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Naraga vaasal la Yeman. Sorgavaasal la Parthiban. Puriyala? December 27 anniku, Sorgavaasal thorakkudhu. Paakalama? Watch Sorgavaasal on Netflix, out 27 December.#SorgavaasalOnNetflix pic.twitter.com/i1gsiY7dUu
— Netflix India South (@Netflix_INSouth) December 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.