Puri Jagannadh: ఆత్మహత్య చేసుకున్న పూరి జగన్నాథ్ అసిస్టెంట్.. కారణం ఇదే..
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో పూరిజగన్నాథ్ టీమ్ దిగ్బంతికి గురైంది

Puri Jagannadh
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.విషయం తెలుసుకున్న పూరిజగన్నాథ్ టీమ్ దిగ్బంతికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైద్రాబాద్ లోని దుర్గంచెరువులో దూకి పూరి అసిస్టెంట్ డైరెక్టర్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా సాయి కుమార్. గతంలో పూరిజగన్నాథ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్టు తెలిసింది. అయితే అప్పుల భాద తట్టుకోలేకే సాయి కుమార్ దుర్గం చెరువులో దూకినట్టు తెలిపారు పోలీసులు.
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
