పూరి సింహం ట్వీట్ బాల‌య్య గురించేనా…?

టాలీవుడ్ లో ఏ చిన్న ఇష్యూ మొద‌లైనా, అది ఆదిప‌త్య పోరుకు దారితీస్తుంది. లెగసీ ఉన్న కుటుంబాల‌కు భారీ ఫ్యాన్ బేస్, రాజకీయ నేప‌థ్యం ఉండ‌టంతో..చిన్న‌, చిన్న గొడ‌వ‌లు కూడా ఈజీగా స‌మ‌సిపోవ‌డం లేదు. తాజాగా లాక్ డౌన్ నేప‌థ్యంలో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో కూడా సినిమా, సీరియ‌ల్ షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే ప్ర‌స్తుతం కొన్ని స‌డ‌లింపులిచ్చింది ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలోనే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కూడా షూటింగుల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని కోరుతూ చిరంజీవి ఇంట్లో రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ శాఖ […]

పూరి సింహం ట్వీట్ బాల‌య్య గురించేనా...?
Follow us

|

Updated on: Jun 01, 2020 | 5:53 AM

టాలీవుడ్ లో ఏ చిన్న ఇష్యూ మొద‌లైనా, అది ఆదిప‌త్య పోరుకు దారితీస్తుంది. లెగసీ ఉన్న కుటుంబాల‌కు భారీ ఫ్యాన్ బేస్, రాజకీయ నేప‌థ్యం ఉండ‌టంతో..చిన్న‌, చిన్న గొడ‌వ‌లు కూడా ఈజీగా స‌మ‌సిపోవ‌డం లేదు. తాజాగా లాక్ డౌన్ నేప‌థ్యంలో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో కూడా సినిమా, సీరియ‌ల్ షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే ప్ర‌స్తుతం కొన్ని స‌డ‌లింపులిచ్చింది ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలోనే ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కూడా షూటింగుల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని కోరుతూ చిరంజీవి ఇంట్లో రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తో టాలీవుడ్ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్ ను క‌లిసి కూడా ప‌రిస్థితులు వివ‌రించారు. అయితే ఈ కార్యక్ర‌మానికి టాలీవుడ్ అగ్ర హీరో బాల‌య్య‌కు ఆహ్వ‌నం అంద‌లేదు. త‌న‌నెవ‌రూ ఆ మీటింగుకు పిల‌వ‌లేద‌ని, వాళ్లంతా భూములు పంచుకునేందుకు స‌మావేశం అయ్యారా అంటూ బాల‌య్య ఆఫ్ ద రికార్డు చేసిన కామెంట్స్ వైర‌ల‌య్యాయి. దీంతో ఇండ‌స్ట్రీలో ముస‌లం పుట్టింది. కొంత‌మంది బాల‌య్య‌కు, మ‌రికొంద‌రు చిరంజీవికి సపోర్ట్ చేస్తూ చీలిపోయారు. అయితే బాల‌య్య‌కు ఓ రేంజ్ లో ఫ్రెండైన పూరి జ‌గ‌న్నాథ్..తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తావిచ్చింది. అడ‌వికి రాజైన సింహానికి, మిగ‌తా జంతువుల‌ను కంపార్ చేస్తూ పూరి వీడియో రిలీజ్ చేశాడు. అసలు ఇది ఆయ‌న ఏ ఉద్దేశంతో రిలీజ్ చేశాడో తెలియ‌దు కానీ, బాల‌య్య ఫ్యాన్స్ మాత్రం పూరి త‌మ సైడే అంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. మ‌రి దీనిపై పూరి ఎటువంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.