AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Double iSmart: డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది .. అదరగొట్టిన రామ్ పోతినేని

ఈ సినిమాలో రామ్ నటన, యాస, యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పూరి మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, నభనటేష్ హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు పూరి.

Double iSmart: డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది .. అదరగొట్టిన రామ్ పోతినేని
Rajeev Rayala
|

Updated on: May 15, 2024 | 10:16 AM

Share

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న రామ్ పోతినేని ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రామ్ నటన, యాస, యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పూరి మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, నభనటేష్ హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు పూరి.

మరోసారి ఈ సినిమాతో రామ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. టీజర్ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాలో రామ్ కు జోడీగా కావ్య థప్పర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. నేడు రామ్ పుట్టిన రోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ లానే ఈ టీజర్ లోనూ రామ్ తన తెలంగాణ యాసతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో మరిన్ని యాక్షన్ సీన్స్ ఉండేలా కనిపిస్తున్నాయి.

డబుల్ ఇస్మార్ట్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. రామ్ ఈ సినిమాతో మరో సారి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి’.

పూరి కనెక్ట్స ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!