Pulsar Bike Ramana: పెళ్లిపీటలెక్కనున్న ‘పల్సర్ బైక్’ సింగర్.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే?
'నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో' సాంగ్ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు హుషారైన స్టెప్పులేసి కండక్టర్ ఝాన్సీ బాగా ఫేమస్ అయిపోయింది. అయితే ఈ ఫోక్ సాంగ్‌కు తన గొంతుతో ప్రాణం పోసింది మాత్రం ప్రముఖ జానపద కళాకారుడు రమణ

‘నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో’ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు హుషారైన స్టెప్పులేసి కండక్టర్ ఝాన్సీ బాగా ఫేమస్ అయిపోయింది. అయితే ఈ ఫోక్ సాంగ్‌కు తన గొంతుతో ప్రాణం పోసింది మాత్రం ప్రముఖ జానపద కళాకారుడు రమణ. అంతకు ముందు పలు బుల్లితెర షోస్, ఈవెంట్లలో పాటలు పాడినప్పటికీ పల్సర్ బైక్ సాంగ్‌తోనే బాగా ఫేమస్ అయ్యాడు రమణ. ఎంతలా అంటే ఇదే పల్సర్ బైక్ సాంగ్‌ను రవితేజ ధమకా సినిమాలోనూ వాడితే అక్కడ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో పాటు ‘పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో..’, ‘వస్తావా.. భాను వస్తావా..’తోనూ సంగీతాభిమానులను అలరించాడీ ఫోక్ సింగర్. తన హుషారైన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులరైన గాయకుడు రమణ శుభవార్త చెప్పాడు. తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఇటీవలే ఈ ఫోక్ సింగర్ నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. డిసెంబర్లోనే నిశ్చితార్థం జరిగినప్పటికీ దీనికి సంబంధించిన వీడియోను తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు కాబోయే వధూవరులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రమణ చేసుకోబోయే అమ్మాయి ఫేరు కుందన. పేరుకు తగ్గట్టుగానే వధువు కుందనపు బొమ్మలాగే ఉంది. ఎంగేజ్‌మెంట్ వీడియోలో అతిథులందరూ చూస్తుండగా.. ఉంగరాలు మార్చుకున్నారు రమణ, కుందన. దీంతో పాటు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.
కేవలం సింగర్‌గానే కాకుండా నటుడిగా, రైటర్‌గా నూ సత్తా చాటుతున్నాడు రమణ. ఇటీవల అతను నటించిన బేబీ 2 షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. దీనికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు కూడా రమణే సమకూర్చడం విశేషం. ఇక సోషల్ మీడియాలోనూ రమణకు మంచి ఫాలోయింగ్ ఉంది. తన డ్యాన్స్ వీడియోలను నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
రమణ, కుందనశ్రీల ఎంగేజ్ మెంట్ వీడియో..
కాబోయే భార్యతో రమణ..
Sieh dir diesen Beitrag auf Instagram an
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








