Curry & Cyanide: ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా
ఈ మధ్యకాలంలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ క్రైం థ్రిల్లర్ ఓటీటీలో టాప్ లో దూసుకుపోతుంది. ఓటీటీలో హారర్, క్రైమ్ థ్రిల్లర్ లకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులు అలాంటి సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి జోనర్ లో వచ్చిందే.. 'కర్రీ అండ్ సైనైడ్'. ఇదొక డాక్యుమెంటరీ సినిమా. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోనూ అదరగొడుతున్నాయి. అంతే కాదు థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి వ్యూస్ తెచ్చుకొని దూసుకుపోతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ క్రైం థ్రిల్లర్ ఓటీటీలో టాప్ లో దూసుకుపోతుంది. ఓటీటీలో హారర్, క్రైమ్ థ్రిల్లర్ లకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులు అలాంటి సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి జోనర్ లో వచ్చిందే.. ‘కర్రీ అండ్ సైనైడ్’. ఇదొక డాక్యుమెంటరీ సినిమా. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఓ మహిళ ఏకంగా ఆరు హత్యలు చేసి పోలీసులకే షాక్ ఇచ్చింది. చాకచక్యంగా హత్యలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంది. ఆరు హత్యల్లో ఓ చిన్నారి కూడా ఉంది. జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం ఈ డాక్యుమెంటరీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. డిసెంబర్ 22న స్ట్రీమింగ్‌కు వచ్చింది ఈ సినిమా. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
కాగా ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా కర్రీ అండ్ సైనైడ్ టాప్ 3 లో ఉంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. 30 దేశాల్లో కర్రీ అండ్ సైనైడ్ సినిమా టాప్ 10 లో దూసుకుపోతుంది. క్రేజీ మూవీస్ ఆదికేశవ, షారుక్ ఖాన్ జవాన్‌ను, ఆక్వామన్ సినిమాలను బీట్ చేసింది కర్రీ అండ్ సైనైడ్’.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.