Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: హిట్లర్ @ 27 ఇయర్స్.. చిరంజీవి బ్లాక్‌బస్టర్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

అసలు హిట్లర్ సినిమాలో హీరో చిరంజీవి కాదు.. ఆయన కంటే ముందు మరొకర్ని అనుకున్నారు. కానీ అది కుదర్లేదు.. ఆ తర్వాత చిరు వచ్చాడు. ఇదంతా జరిగింది 1996లో.. హిట్లర్ మనకు విడుదలైంది ఆ మరుసటి ఏడాదిలో. 1996లో మలయాళంలో ఓ సినిమా రూపొందుతుంది. దాని పేరు హిట్లర్.. కథ బాగుంది.. కథనం బాగుంటుంది.. కచ్చితంగా విజయం సాధిస్తుందని ముందుగానే తెలియడంతో..

Chiranjeevi: హిట్లర్ @ 27 ఇయర్స్.. చిరంజీవి బ్లాక్‌బస్టర్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
Hitler
Follow us
Praveen Vadla

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 04, 2024 | 5:56 PM

‘హిట్లర్’.. చిరంజీవి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ ఈ సినిమా. రీమేక్ సినిమానే కానీ తెలుగు ఆడియన్స్ పిచ్చపిచ్చగా నచ్చడమే కాదు.. చిరంజీవి చాలా ఏళ్లుగా బాకీ పడిపోయిన బ్లాక్‌బస్టర్‌ను కూడా ఇచ్చిన సినిమా. అయితే ఈ సినిమా వెనక చాలా పెద్ద కథ ఉంది. అదేంటో తెలియాలంటే 28 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. అప్పుడు జరిగిన ఓ ఆసక్తికరమైన కథ తెలుసుకోవాల్సిందే. అసలు హిట్లర్ సినిమాలో హీరో చిరంజీవి కాదు.. ఆయన కంటే ముందు మరొకర్ని అనుకున్నారు. కానీ అది కుదర్లేదు.. ఆ తర్వాత చిరు వచ్చాడు. ఇదంతా జరిగింది 1996లో.. హిట్లర్ మనకు విడుదలైంది ఆ మరుసటి ఏడాదిలో. 1996లో మలయాళంలో ఓ సినిమా రూపొందుతుంది. దాని పేరు హిట్లర్.. కథ బాగుంది.. కథనం బాగుంటుంది.. కచ్చితంగా విజయం సాధిస్తుందని ముందుగానే తెలియడంతో విడుదలకు ముందే రీమేక్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే కొన్నిసార్లు ఒకరి కోసం ప్లాన్ చేసిన సినిమాలు మరొకరికి వస్తుంటాయి. అవి వాళ్ల కెరీర్‌ను మార్చేస్తుంటాయి.

అలా హిట్లర్ సినిమా విషయంలోనూ జరిగింది. అసలేం జరిగిందంటే.. మమ్ముట్టి హీరోగా సిద్ధిఖీ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుంది.. అదింకా విడుదల కూడా కాలేదు.. కానీ కథ నచ్చి తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాత ఎడిటర్ మోహన్ నిర్ణయించుకున్నాడు. రైట్స్ కూడా తీసుకున్నాడు.. తీరా రిలీజ్ టైమ్ వచ్చిన తర్వాత విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్‌కు ఓ సిడి తెప్పించుకుని చూసాడు ఎడిటర్ మోహన్. ఆయనతో పాటు ప్రముఖ రైటర్ మరుధూరి రాజా కూడా ఉన్నాడు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్, రాజా అతడి భార్య కలిసి ఓ హోటల్‌లో హిట్లర్ సినిమాను చూసారు. సినిమా చూసాక ఇది తెలుగులో బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫిక్సైపోయాడు రాజా.

మోహన్ బాబు హీరోగా ఈ సినిమాను రీమేక్ చేద్దామంటూ ఎడిటర్ మోహన్ ఆలోచించి.. దర్శకుడిగా ఇవివి సత్యనారాయణను అనుకున్నాడు. అయితే అప్పటికే వీడెవడండీ బాబూ, అదిరింది అల్లుడు సినిమాలకు మోహన్ బాబుతోనే కమిట్ అయ్యాడు ఇవివి. ఆ తర్వాత ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయనుకోండి. మూడోసారి కూడా మోహన్ బాబుతోనే సినిమా అంటే ఎందుకో నో అన్నారు ఇవివి. సరిగ్గా అదే సమయంలో మోహన్ బాబు చేతి నుంచి హిట్లర్ చేజారిపోయింది. ఆ తర్వాత హిట్లర్ విడుదలైన మూడు రోజుల తర్వాత తెలుగులో ఈ సినిమాను చిరంజీవి చేస్తున్నాడంటూ మరుధూరి రాజాకు ఎడిటర్ మోహన్ ఫోన్ చేసి మరీ చెప్పాడు. దాంతో చిరుకు అయితే సినిమా ఇంకా బాగా సూట్ అవుతుందని తెగ మురిసిపోయాడు రాజా. దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య వచ్చిన తర్వాత మరుధూరి రాజా కాకుండా ఎల్బీ శ్రీరామ్ రైటర్‌గా వచ్చాడు. ఆయన రాకతో మరుదూరి రాజా చాలా హర్ట్ అయ్యారు. అవమానంగా ఫీల్ అయిపోయి బయటికి వెళ్లిపోయాడు. కానీ నిర్మాత మోహన్ మాట కాదనలేక ఓ వర్షన్ రాజా కూడా రాసిచ్చాడు. తెలుగులో చిరు ఇమేజ్‌కు తగ్గట్లు కథలో చాలా మార్పులే జరిగాయి. పైగా హిట్లర్‌కు ముందు చిరంజీవి వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. 1995 డిసెంబర్‌లో రిక్షావోడు డిజాస్టర్ కావడంతో 1996లో ఈయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కావాలనే గ్యాప్ తీసుకున్నాడు చిరు. అలా 1997 జనవరి 4న హిట్లర్ వచ్చింది. బాలయ్య పెద్దన్నయ్య సినిమా వచ్చినా కూడా ఆ ఏడాది కమర్షియల్‌గా చాలా పెద్ద విజయం సాధించింది హిట్లర్. ఐదుగురు చెల్లెళ్ల సెంటిమెంట్‌తో పాటు సుధాకర్ అండ్ బ్యాచ్ కామెడీ కూడా హిట్లర్‌గా బాగా కలిసొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.