AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khiladi: హిట్‌పై బీభత్సమైన కాన్ఫిడెన్స్.. సినిమా విడుదలకు ముందే డైరెక్టర్​కు కోటి రూపాయల కారు గిఫ్ట్

ఓ టాలీవుడ్ డైరెక్టర్​కు అదిరిపోయే కారును గిఫ్ట్​గా ఇచ్చారు సినిమా నిర్మాత. అది కూడా సినిమా రిలీజ్ అవ్వకముందే. ఇంతకీ ఆ కారు విలువ ఎంతో తెలిస్తే మీరు షాక్ తింటారు.

Khiladi: హిట్‌పై బీభత్సమైన కాన్ఫిడెన్స్.. సినిమా విడుదలకు ముందే డైరెక్టర్​కు కోటి రూపాయల కారు గిఫ్ట్
Director Ramesh Varma
Ram Naramaneni
|

Updated on: Jan 30, 2022 | 1:42 PM

Share

Tollywood: సినిమా రిలీజయ్యాక.. మంచి సక్సెస్ అయితే దర్శకులకు.. నిర్మాతలు గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. కానీ మూవీ రిలీజ్ కాకుండా ఓ డైరెక్టర్.. కోటి రూపాయల కారును బహుమతిగా అందుకున్నాడు. అతడు ఎవరో కాదు. మాస్ మహారాజా రవితేజ(Raviteja) కొత్త సినిమా ‘ఖిలాడి’ డైరెక్టర్ రమేశ్​వర్మ(Ramesh Varma). ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. పక్కా మాస్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ మూవీ విజయంపై మేకర్స్ భారీ నమ్మకంతో ఉన్నారు. సినిమా హిట్ కొడుతుందని  ముందే పక్కాగా చెప్పేస్తున్నారు. ​ ఈ క్రమంలోనే సినిమా రిలీజ్​కు ముందే డైరెక్టర్​ రమేశ్​వర్మకు కాస్ట్లీ గిఫ్ట్​ ఇచ్చారు నిర్మాత కోనేరు సత్యనారాయణ (Satyanarayana Koneru). ‘ఒక ఊరిలో’, ‘రైడ్’, ‘వీర’, ‘అబ్బాయితో అమ్మాయ్’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న రమేశ్ వర్మ.. 2019లో ‘రాక్షసుడు’ మూవీతో మంచి విజయం దక్కించుకున్నాడు. ​దీని తర్వాత చేస్తున్న సినిమానే ‘ఖిలాడి’. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ.. దాదాపు రూ.1.15 కోట్ల విలువైన రేంజ్​ రోవర్​ కారును రమేశ్​వర్మకు బహుమతిగా ఇచ్చారు. ఈ మూవీలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ యాక్టర్ అర్జున్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

కాగా హీరో రవితేజ ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కిలాడీ విడుదలకు సిద్దంగా ఉండగా.. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Also Read: ఒంట్లో నలతగా ఉందని.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే ప్రసవించిన బాలిక.. ఎంక్వైరీ చేయగా

Kadapa: శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం