AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: ‘థియేటర్ల బంద్’ వెనక అసలు విషయమిదే.. పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన దిల్ రాజు

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. ఇలా టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఆదివారం అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టగా తాజాగా దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు.

Dil Raju: 'థియేటర్ల బంద్' వెనక అసలు విషయమిదే.. పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన దిల్ రాజు
Dil Raju
Basha Shek
|

Updated on: May 26, 2025 | 5:22 PM

Share

థియేటర్ల బంద్ వ్యవహారం, పవన్ కల్యాణ్ లేఖ తదితర అంశాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం (మే26) మీడియాతో మాట్లాడారు. ‘ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు మాకు పర్సంటేజ్ అయితే బాగుంటుందని  మాట్లాడుకున్నారు. ఒక సంవత్సరంలో 150 సినిమాలు విడుదలయితే 90 సినిమాలు అందరూ పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ లేదా పర్సంటేజ్ బేసిస్ లో ఆడుతున్నాయి. ఇలా ఆడుతున్న సమయంలోనే కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అప్పుడే ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ లో పర్సంటేజ్ సిస్టం కోరుకున్నారు. అది హైదరాబాదులో నిర్మాతలకు కమ్యూనికేట్ అయితే ఏప్రిల్ 26న గిల్డ్ మీటింగ్ జరిగింది.  అప్పుడు జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ ఆపుతాము అని ఈస్ట్ గోదావరి థియేటర్స్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు మధ్య చర్చలు జరిగాయి.  అప్పుడు నిర్మాతలం మేమందరం కలిసి ఎందుకు వాళ్లకు వర్క్ అవుట్ అవ్వడం లేదు. ఒక 6 మంత్స్ నుంచి వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకురమ్మని చెబుదాం. అలా వచ్చినప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు తెలుస్తాయి. .అప్పటికి హరిహర వీరమల్లు సినిమా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు’

‘థియేటర్లు మూసేయడాలు వద్దు నిర్మాతలు జాయింట్ మీటింగ్ పెట్టండి అనుకున్నాం.  మే 24న పెట్టాము.. ఈ లోపలే విషయం డైవర్ట్ అయిపోయింది. కళ్యాణ్ గారి సినిమా మీదకు ఇది వెళ్లిపోయింది. కళ్యాణ్   సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. రాంగ్ కమ్యూనికేషన్ తో కళ్యాణ్ గారి సినిమా మీదికి తీసుకెళ్లారు. మే 30న భైరవం.. జూన్ 5 కమల్ హాసన్ సినిమా ఉంది. 12  హరి హర వీరమల్లు,  20న  కుబేర, జూలై 4 కింగ్ డమ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి’

మేము అన్ని ఏరియాల్లో ఉన్నాం. ఫస్ట్ వీక్ బాగా కలెక్షన్స్ వస్తే రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్స్ తగ్గిపోగానే పర్సంటేజ్ ఇస్తున్నాము.. అది వాళ్లకు బాగా కష్టమైంది అది అందరికీ తెలుసు. తెలంగాణ స్టేట్ మొత్తం 370 సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి. SVC, మా అసోసియేట్స్ అన్నీ కలిపి 30 థియేటర్స్ నా దగ్గర ఉన్నాయి. ఏషియన్ సునీల్, సురేష్ కంపెనీల్లో 90 థియేటర్లు ఉన్నాయి. మీడియా వాళ్లకు నేను క్లారిటీ ఇస్తున్నాను.. 370 సింగిల్ స్క్రీన్స్ లో మా దగ్గర ఉన్నవి కేవలం 120 మాత్రమే. ఈస్ట్ గోదావరిలో మొదలైన గొడవ రాంగ్ కమ్యూనికేషన్ తో ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఈస్ట్ గోదావరిలో ఒక డిస్ట్రిబ్యూటర్ మొదలుపెట్టిన ఈ విషయం ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది.. అది తీసుకొచ్చి తెలంగాణకు ముడిపెట్టారు. కళ్యాణ్ గారు హర్ట్ అయ్యారు.. ఆయన హర్ట్ అయితే తిడితే పడతాం.  ఆయన మాకు పెద్దన్న లాగా.. 22 ఏళ్ళ నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .