పవన్ ‘పింక్’ రీమేక్ టైటిల్‌పై దిల్ రాజు క్లారిటీ!

ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న.. బాలీవుడ్ మూవీ ‘పింక్’ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై తాజాగా పలు రకాల రూమర్లు జోరందుకుంటున్నాయి. ముందు రేణుదేశాయ్ నటిస్తుందని, ఆ తరువాత.. పవన్ కళ్యానే స్వయంగా ఆలీకి ఆహ్వానం పంపించారని ఇలా  రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే.. ఈ సినిమా తెలుగు టైటిల్‌పై కూడా కొన్ని రకాల వార్తలు ట్రోల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. అందులోనూ […]

పవన్ 'పింక్' రీమేక్ టైటిల్‌పై దిల్ రాజు క్లారిటీ!

ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న.. బాలీవుడ్ మూవీ ‘పింక్’ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై తాజాగా పలు రకాల రూమర్లు జోరందుకుంటున్నాయి. ముందు రేణుదేశాయ్ నటిస్తుందని, ఆ తరువాత.. పవన్ కళ్యానే స్వయంగా ఆలీకి ఆహ్వానం పంపించారని ఇలా  రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే.. ఈ సినిమా తెలుగు టైటిల్‌పై కూడా కొన్ని రకాల వార్తలు ట్రోల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. అందులోనూ ఈ చిత్రంలో ఇదే ప్రధాన పాత్ర కూడా. అయితే తెలుగులో దీనికి ‘లాయర్ సాబ్’ అనే పేరు పెట్టినట్లు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్‌గా మారింది. దీనిపై తాజాగా స్పందించిన నిర్మాత దిల్ రాజు.. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఏదీ అనుకోలేదని, ఉగాది వరకూ టైటిల్ అనౌన్స్ చేస్తామని తెలిపారు.

అలాగే ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు అంజలి, మల్లేశం ఫేమ్ అనన్య, నివేదా థామస్‌లు కూడా నటిస్తున్నారట. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమా సమ్మర్ గిఫ్ట్‌గా మే 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

Published On - 2:59 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu