జబర్దస్త్ ‘ఆటో’ పంచ్.. పరోక్షంగా మెగా బ్రదర్‌కు చురక!

Auto Ram Prasad Sensational Comments: సుమారు ఏడేళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఏకైక షో ‘జబర్దస్త్’. ఇది కేవలం కామెడీ షో మాత్రమే కాదు.. అదొక బ్రాండ్ అని చెప్పాలి. అంచెలంచెలుగా ఎదుగుతూ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా స్టార్లు సైతం ఇందులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇక షో ఇంత పెద్ద హిట్ కావడానికి కంటెస్టెంట్లు, […]

జబర్దస్త్ 'ఆటో' పంచ్.. పరోక్షంగా మెగా బ్రదర్‌కు చురక!

Auto Ram Prasad Sensational Comments: సుమారు ఏడేళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఏకైక షో ‘జబర్దస్త్’. ఇది కేవలం కామెడీ షో మాత్రమే కాదు.. అదొక బ్రాండ్ అని చెప్పాలి. అంచెలంచెలుగా ఎదుగుతూ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా స్టార్లు సైతం ఇందులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇక షో ఇంత పెద్ద హిట్ కావడానికి కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లతో పాటుగా జడ్జ్‌ల ప్రమేయం కూడా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన వారిలో ఆటో రాంప్రసాద్ ఒకరు. సుడిగాలి సుధీర్ టీమ్‌కు స్కిట్లు రాస్తున్న ఆయన రైటర్‌గా మంచి గుర్తింపును సంపాదించారు. ఇక ఇప్పుడు హీరోగా కూడా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘త్రీ మంకీస్’. ఈ మూవీకి సుడిగాలి సుధీర్ టీమ్ ప్రమోషన్ విపరీతంగా చేస్తోంది. ఈ క్రమంలోనే రాం‌ప్రసాద్ జబర్దస్త్‌పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘జబర్దస్త్‌ను వదిలేసే ఆలోచన ఏమైనా ఉందా.. కొత్తగా చాలా షోస్ వస్తున్నాయి కదా అందులో ఆఫర్స్ రావట్లేదా.? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.

‘జబర్దస్త్‌లో చేస్తే వచ్చే పేరు.. మరే షో చేసినా రాదు. అందుకే నేను మిగతా ఏ షోకి వెళ్ళలేదు. అంతేకాకుండా జబర్దస్త్ ఓ మ్యాజిక్ అని.. కొత్త షోతో అలాంటిదే మళ్ళీ జరగాలంటే సాధ్యం కాదని.. జబర్దస్త్‌ను వదిలిపెట్టనని రాం ప్రసాద్ తేల్చి చెప్పారు. తనతో పాటుగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా జబర్దస్త్‌ను వదిలిపెట్టరని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ కామెంట్స్‌తో పరోక్షంగా మెగా బ్రదర్‌కు చురకలు అంటిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా జబర్దస్త్ ముందు కొత్తగా వచ్చిన ఏ షో అయినా కూడా ప్లాప్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీతెలుగులో ప్రసారమవుతున్న ‘అదిరింది’ షోకు అంతగా ఆదరణ లభించట్లేదు. టీఆర్పీ రేటింగ్స్‌ కూడా చాలా డల్‌గా ఉన్నాయని వినికిడి. ఇలాంటి తరుణంలో ఆటో రాంప్రసాద్ వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి.

Published On - 3:51 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu