‘బాహుబలి’ ట్వీట్‌కు ‘ఆర్ఆర్ఆర్‌’ పంచ్.. నెటిజన్ల నవ్వులు..!

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. జూలై 30న ఈ చిత్రానికి విడుదల తేదిని ఖరారు చేశారు. అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క లుక్‌‌ను కూడా మూవీ యూనిట్ విడుదల చేయలేదు. దీంతో ఫస్ట్‌లుక్ విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ నుంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో బాహుబలి టీమ్ ముందుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్‌లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పాలంటూ ట్వీట్ చేసింది. […]

'బాహుబలి' ట్వీట్‌కు 'ఆర్ఆర్ఆర్‌' పంచ్.. నెటిజన్ల నవ్వులు..!

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. జూలై 30న ఈ చిత్రానికి విడుదల తేదిని ఖరారు చేశారు. అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క లుక్‌‌ను కూడా మూవీ యూనిట్ విడుదల చేయలేదు. దీంతో ఫస్ట్‌లుక్ విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ నుంచి డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో బాహుబలి టీమ్ ముందుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్‌లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పాలంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించింది. వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తోంది.

‘‘మహిష్మతి సామ్రాజ్యవాసులు ఆర్ఆర్ఆర్ ఫస్ట్‌లుక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా చెప్తున్నందుకు క్షమించండి మీరు మాత్రం పండుగ శుభాకాంక్షలు, థ్యాంక్యు మెసేజ్‌లు చెబుతూ కాలం గడుపుతున్నారు. మీరిస్తున్న సమాధానాలు మా ప్రజలకు మంచి టైమ్‌పాస్‌ను ఇస్తున్నాయి. డియర్ కెప్టెన్ రాజమౌళి గారు.. మీరైనా అప్‌డేట్ చేయండి ప్లీజ్’’ అంటూ సరదాగా బాహుబలి టీమ్ ట్వీట్ చేసింది. ఇక దీనికి స్పందించిన ఆర్ఆర్ఆర్ టీమ్.. ‘‘చూస్తున్నారా ఎవరు ఎలా మాట్లాడుతున్నారో. మీ అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాం. పోస్టర్లు, ట్రైలర్ల విషయంలో ఫ్యాన్స్‌ను బాహుబలి టీమ్ ఎంతగా ఎదురుచూసేలా చేసిందో మేము అంత ఈజీగా మర్చిపోలేము. మా అభిమానులను మేము గౌరవిస్తాం. వారి ఆశలను మేము నెరవేరుస్తామని వారికి తెలుసు. అందుకే ఆర్ఆర్ఆర్ ఫస్ట్‌లుక్‌ కోసం ఎదురుచూస్తునే ఉండండి. త్వరలోనే వస్తుంది’’ అంటూ కామెంట్ పెట్టింది. ఈ కన్వర్జేషన్ అందరి చేత నవ్వులు పూయిస్తుండగా.. ఎన్టీఆర్, చెర్రీ అభిమానులు మాత్రం ‘వెయిట్ చేస్తున్నాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఫిక్షన్ కథాంశంతో ఆర్ఆర్ఆర్‌ తెరకెక్కుతోంది. ఈ మూవీలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని పలు భాషల్లో విడుదల చేయనుండగా.. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఆర్ఆర్ఆర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

Published On - 9:41 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu