స్టార్ హీరోయిన్ల మధ్య కోల్డ్‌ వార్.. ఎందుకంటే..!

వరుస హిట్లతో ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు రష్మిక మందన, పూజా హెగ్డే. ఈ సంక్రాంతికి ఒక్కో హిట్‌ను తమ ఖాతాలో వేసుకొన్న ఈ ఇద్దరి చేతినిండా ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సంవత్సరం వీరిద్దరి డైరీ ఫుల్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు ఇటు కోలీవుడ్‌లో రష్మిక, అటు బాలీవుడ్‌లో పూజ ఇద్దరు వరుస అవకాశాలను కూడా తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెమ్యునరేషన్ విషయంలో వీరిద్దరి మధ్య ఇప్పుడు కోల్డ్‌వార్ […]

స్టార్ హీరోయిన్ల మధ్య కోల్డ్‌ వార్.. ఎందుకంటే..!

వరుస హిట్లతో ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు రష్మిక మందన, పూజా హెగ్డే. ఈ సంక్రాంతికి ఒక్కో హిట్‌ను తమ ఖాతాలో వేసుకొన్న ఈ ఇద్దరి చేతినిండా ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సంవత్సరం వీరిద్దరి డైరీ ఫుల్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు ఇటు కోలీవుడ్‌లో రష్మిక, అటు బాలీవుడ్‌లో పూజ ఇద్దరు వరుస అవకాశాలను కూడా తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెమ్యునరేషన్ విషయంలో వీరిద్దరి మధ్య ఇప్పుడు కోల్డ్‌వార్ జరుగుతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.

ఒకప్పుడు వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న పూజా హెగ్డే.. అరవింద సమేతతో పెద్ద హిట్‌ను కొట్టింది. ఇక ఆ తరువాత వెంటనే మహర్షి చిత్రానికి తన రెమ్యునరేషన్‌ను అమాంతం రూ.2కోట్లకు పెంచేసిందట పూజా. అయితే పెద్దగా హిట్లు లేకపోయినా, రెమ్యునరేషన్ పెంచడంపై నిర్మాతలు కాస్త అసంతృప్తి చెందడంతో.. ఆ తరువాత తన పారితోషికాన్ని కోటి 50లక్షలకు ఫైనల్ చేసిందట పూజా. ఈ క్రమంలో అల వైకుంఠపురములో చిత్రానికి కూడా అదే రెమ్యునరేషన్‌ను తీసుకుందట. మరోవైపు ఛలోతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రష్మికకు ముందు నుంచే మంచి డిమాండ్ ఉంది. ఇక ఇటీవల మహేష్ సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు మంచి విజయం సాధించడంతో ఇప్పుడు తన రెమ్యునరేషన్‌ను పెంచేసిందట రష్మిక. తాజా సమాచారం ప్రకారం పూజా రెమ్యునరేషన్ కంటే రష్మికకే ఎక్కువగా ఉందట. దీంతో తన పారితోషికం తక్కువేం కాదని సన్నిహితులతో చెప్పిస్తుందట పూజా. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా అల వైకుంఠపురములో చిత్రంతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్, తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో తీసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్‌గా పూజా, రష్మిక ఇద్దరిలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. మరి ఆ అవకాశం చివరకు ఎవరి సొంతమవుతుందో తెలుసుకోవాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Published On - 1:12 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu