Rakul Preet Singh- Jackky Bhagnani: రకుల్, జాకీ జంటకు ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు..

వీరిద్దరు ముందుగా తమ పెళ్లిని దుబాయ్ లేదా మాల్దీవ్స్ లో చేసుకోవాలని అనుకున్నారు. కానీ మాల్దీవ్స్ ఇష్యూ, ఇండియా టూరిజం అభివృద్ధి గురించి ప్రధాని మోదీ మాట్లాడడంతో వీరి వివాహ వేదికను గోవాకు మార్చుకున్నారు. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ లో జరిగే తమ పెళ్లికి హాజరుకావాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం పించారు. అయితే అప్పటికే ఫిక్స్ అయిన షెడ్యూల్స్ కారణంగా మోదీ వీరి వివాహానికి హాజరుకాలేదు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Rakul Preet Singh- Jackky Bhagnani: రకుల్, జాకీ జంటకు ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు..
Raku, Jackky, Pm Modi
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 22, 2024 | 8:35 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నిన్న ఫిబ్రవరి 21న గోవాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కొన్నాళ్లుగా రకుల్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది. తమ రిలేషన్ గురించి 2022లో అధికారికంగా బయటపెట్టింది రకుల్. వీరిద్దరు ముందుగా తమ పెళ్లిని దుబాయ్ లేదా మాల్దీవ్స్ లో చేసుకోవాలని అనుకున్నారు. కానీ మాల్దీవ్స్ ఇష్యూ, ఇండియా టూరిజం అభివృద్ధి గురించి ప్రధాని మోదీ మాట్లాడడంతో వీరి వివాహ వేదికను గోవాకు మార్చుకున్నారు. గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్ లో జరిగే తమ పెళ్లికి హాజరుకావాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం పించారు. అయితే అప్పటికే ఫిక్స్ అయిన షెడ్యూల్స్ కారణంగా మోదీ వీరి వివాహానికి హాజరుకాలేదు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

రకుల్, జాకీకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా ఓ నోట్ పంపించారు ప్రధాని మోదీ. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది రకుల్. “రకుల్, జాకీ.. ఇద్దదు వారి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణంలో వారి జీవితం ఎంతో సంతోషంగా సాగాలి. అటువంటి అద్భుతమైన జీవితానికి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరాలు మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకే బాటలో పయనించాలి. ఈ ప్రేమ ఇద్దరి మనసులు.. ఆలోచనలు.. పనులు కలిసి ఉండాలి. ఎప్పుడూ ఒకరికొకరు అండగా ఉండాలి. అన్నీ రాబోయే బాధ్యతలను ధైర్యంగా, ఆలోచనతో కూడిన ప్రేమతో నిర్వహించాలి. తన భార్యకు ఎప్పుడూ అండగా ఉండాలి. ఒకరిలోని మంచి లక్షణాలను మరొకరు నేర్చుకోండి. నన్ను మీ పెళ్లికి ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు.. ఇలా మళ్లీ ఒక అందమైన ఈవెంట్ కోసం నా శుభాకాంక్షలు.. మీకు నా ఆశీస్సులు. ” అంటూ నరేంద్ర మోదీ ఓ స్పెషల్ నోట్ పంపారు.

ప్రధాని మోదీ పంపిన లేఖను తన సోషల్ మీడియో ఖాతాలో షేర్ చేస్తూ “మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఎంతో ముఖ్యమైనవి. చాలా కృతజ్ఞతలు మోదీ గారు” అంటూ రాసుకొచ్చింది. అటు జాకీ భగ్నానీ కూడా మోదీకి థాంక్యూ చెబుతూ ట్వీట్ చేశారు.