ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం… నటుడి తల్లికి కరోనా పాజిటివ్

బాలీవుడ్‌లో కరోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో నటుడి ఇంట్లో కరోనా వైరస్ క‌ల‌క‌లం రేపింది. బాలీవుడ్ న‌టుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా సోకింది. త‌న త‌ల్లికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సత్యజిత్ సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్ర‌పంచానికి వెల్ల‌డించాడు. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావడంతో టెస్టులు నిర్వహించారని తెలిపాడు. రిపోర్ట్స్ లో ఆమెకు కరోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు. ప్రస్తుతం తన తల్లికి నానావతి […]

  • Ram Naramaneni
  • Publish Date - 12:32 pm, Mon, 18 May 20
ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం... నటుడి తల్లికి కరోనా పాజిటివ్

బాలీవుడ్‌లో కరోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో నటుడి ఇంట్లో కరోనా వైరస్ క‌ల‌క‌లం రేపింది. బాలీవుడ్ న‌టుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా సోకింది. త‌న త‌ల్లికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సత్యజిత్ సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్ర‌పంచానికి వెల్ల‌డించాడు. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావడంతో టెస్టులు నిర్వహించారని తెలిపాడు. రిపోర్ట్స్ లో ఆమెకు కరోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు. ప్రస్తుతం తన తల్లికి నానావతి హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్న‌ట్టు వివ‌రించాడు.

‘అమ్మకి కరోనా సోక‌డంతో నేను, నా సోదరి హోం క్వారంటైన్‌లో ఉన్నాము. ప్రజంట్ మా ఇద్దరికి ఎలాంటి సింటమ్స్ లేవు. ప్రతి రోజు ఫోన్, వీడియో కాల్ ద్వారా అమ్మతో మాట్లాడుతున్నాం. ఆమె త్వరలోనే క‌రోనా బారి నుంచి కోలుకుంటుందని ఆశిస్తున్నాం. ఇటువంటి గడ్డు పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదని’సత్యజిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ విపత్కర సమయంలో మాకు అండగా నిలిచిన స‌న్నిహితులు, ఫ్రెండ్స్, కరోనా వారియ‌ర్స్, బీఎంసీ ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నాను. మీ ప్రేమ, బ్లెస్సింగ్స్ మాకెంతో అవసరం”అని సత్యజిత్‌ పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

Bas kuch dino ki baat hai. Hang in there. Never let a bully win. Even if it’s a fucking virus.

A post shared by सत्यजीत/Satyajeet Dubey (@satyajeetdubey) on