Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chatrapathi Movie: ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?.. వైరలవుతున్న ఫోటోస్..

మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ ఆల్ టైమ్ సూపర్ హిట్. అయితే ఇందులో సూరీడు అనే చిన్న కుర్రాడి పాత్ర గురించి చెప్పక్కర్లేదు. సినిమాలో కనిపించింది కొద్దిసేపు అయినా... ప్రభాస్ ను ఛత్రపతిగా మార్చేది ఆ కుర్రాడే. రౌడీలు ఆ కుర్రాడిపై దాడి చేయడంతో అప్పటివరకు ప్రశాంతంగా కనిపించే ప్రభాస్ ఒక్కసారిగా ఉగ్రనరసింహావతారం ఎత్తి రౌడీలను అల్లాడిస్తాడు. ఈ ఒక్క సీన్ సినిమాకే హైలెట్ అయ్యింది.

Chatrapathi Movie: ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?.. వైరలవుతున్న ఫోటోస్..
Chatrapathi Suridu
Follow us
Rajitha Chanti

|

Updated on: May 01, 2024 | 9:50 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళీ కాంబోలో వచ్చిన సినిమా ఛత్రపతి. ఈ సినిమాతో మాస్ హీరోగా ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో శ్రియా శరణ్ కథానాయికగా నటించగా.. భానుప్రియ, అజయ్, షఫి కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికీ ఈ సినిమాకు అభిమానులు ఉన్నారు. ఛత్రపతి సినిమా వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు.. ప్రభాస్ మాస్ నటవిశ్వరూపం సినిమాకే హైలెట్ అయ్యాయి. ఇక మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ ఆల్ టైమ్ సూపర్ హిట్. అయితే ఇందులో సూరీడు అనే చిన్న కుర్రాడి పాత్ర గురించి చెప్పక్కర్లేదు. సినిమాలో కనిపించింది కొద్దిసేపు అయినా… ప్రభాస్ ను ఛత్రపతిగా మార్చేది ఆ కుర్రాడే. రౌడీలు ఆ కుర్రాడిపై దాడి చేయడంతో అప్పటివరకు ప్రశాంతంగా కనిపించే ప్రభాస్ ఒక్కసారిగా ఉగ్రనరసింహావతారం ఎత్తి రౌడీలను అల్లాడిస్తాడు. ఈ ఒక్క సీన్ సినిమాకే హైలెట్ అయ్యింది.

ఇక సూరీడు పాత్రలో నటించిన కుర్రాడు తనదైన నటనతో అప్పట్లోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సూరీడు పాత్రలో కనిపించిన కుర్రాడి పేరు భశ్వంత్ వంశి. అమాయకమైన చూపులు.. సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఛత్రపతి సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లిన అతడు మొదటి రౌండ్లోనే సెలక్ట్ అయ్యాడట. అతడి అమాయక చూపులకు జక్కన్న ఫిదా అయిపోయి సూరీడు పాత్రకు సెలక్ట్ చేసుకున్నారట. ఇక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు భశ్వంత్ వంశీ. తన తల్లితో కలిసి సూరీడు కనిపించిన సీన్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయాడానికి ఎక్కువగా ఉపయోగపడింది.

అయితే ఈ సినిమా తర్వాత సూరీడు పాత్రలో కనిపించిన కుర్రాడు మరో మూవీలో కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పెద్దొడు అయిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియలో భశ్వంత్ వంశి ఫోటోస్ వైరలవుతున్నాయి. ఛత్రపతి సినిమాలో తన తల్లిగా కనిపించిన అనిత చౌదరీతో సూరీడు దిగిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అయితే ఈ ఫోటో ఎప్పుడు దిగారు అనే విషయం మాత్రం క్లారిటీ రాలేదు. సూరీడు పెద్దయ్యాక గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. గడ్డం, మీసాలతో ఊహించలేని విధంగా కనిపిస్తున్నారు.

Suridu

Suridu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.