Shah Rukh Khan: ఆ క్రికెటర్ షారుఖ్ ఖాన్‌కు అల్లుడంట..! స్వయంగా బాద్‌షానే పిలుస్తున్నాడు.. ఎవరంటే..
గతేడాది పఠాన్, జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఈ రెండు చిత్రాలు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అయితే బాద్ షాకు ఆ స్టార్ క్రికెటర్ అల్లుడు అవుతాడంట. అతడిని ఇప్పటికీ ఎప్పటికీ అల్లుడు అనే పిలుస్తానని చెప్పుకొచ్చాడు బాద్ షా. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..

బాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎంతో మంది నటీనటులతో కలిసి అనేక సూపర్ హిట్స్ అందుకున్నారు. గతేడాది పఠాన్, జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఈ రెండు చిత్రాలు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అయితే బాద్ షాకు ఆ స్టార్ క్రికెటర్ అల్లుడు అవుతాడంట. అతడిని ఇప్పటికీ ఎప్పటికీ అల్లుడు అనే పిలుస్తానని చెప్పుకొచ్చాడు బాద్ షా. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ఇంకెవరు టీమిండియా క్రికెట్ విరాట్ కోహ్లీ. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. కేవలం విరాట్.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ భర్త కావడం. ఆ కారణంగానే అతడిని అల్లుడు అని పిలుస్తానని స్వయంగా బాద్ షానే వెల్లడించాడు. అనుష్క శర్మ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘రబ్ నే బనా దీ జోడీ’తో అడుగుపెట్టింది. ఇందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరిద్దరి కాంబోలో జబ్ తో హై జాన్, జీరో సినిమాలు వచ్చాయి. పెళ్లి తర్వాత అనుష్క సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుఖ్ అనుష్క భర్త, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఓపెన్‌గా కామెంట్స్ చేశాడు. విరాట్ అనుష్కను కలిసేందుకు సెట్స్‌కు వచ్చేవాడని.. ఆ సమయంలో తనతో చాలా సమయం గడిపానని అన్నారు. అనుష్క, విరాట్ ఇద్దరు ప్రేమలో ఉన్నప్పటి నుంచి తనకు తెలుసు అని అన్నారు.
స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన షారుఖ్ “నేను విరాట్ కోహ్లీతో చాలా సమయం గడిపాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. మేము అతన్ని ‘బాలీవుడ్ అల్లుడు’ అని పిలుస్తాము. మిగతా క్రికెటర్స్ అందరికంటే నాకు విరాట్ ఎక్కువగా తెలుసు. విరాట్, అనుష్క ఇద్దరితో చాలా సమయం గడిపాను. అతను అనుష్కతో డేటింగ్ చేస్తున్నప్పటి నుంచి మా మధ్య పరిచయం స్నేహంగా మారింది. మేము కలిసి సినిమా చేస్తున్నప్పుడు విరాట్ అనుష్క కోసం సెట్ కు వచ్చేవాడు. అలా మా ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబందం ఏర్పడింది ” అని అన్నారు. గతేడాది ఐపీఎల్‌లో షారుఖ్, విరాట్ కలిసి డ్యాన్స్ కూడా చేశారు. షారుఖ్ నటించిన ‘పఠాన్’ చిత్రంలోని ‘ఝుమే జో పఠాన్’ పాటకు ‘హుక్ స్టెప్’ ఇద్దరూ కలిసి చేశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.