AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరంజీవి చేయాల్సిన సినిమా ఆ హీరో చేసి హిట్టు కొట్టాడు.. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. అదేంటంటే.. ఒకప్పుడు చిరు బ్లాక్ బస్టర్ హిట్ మిస్సయారంట. చిరు చేయాల్సిన సినిమాను కోలీవుడ్ నటుడు అర్జున్ చేసి హిట్టు కొట్టారు. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా ?.

Megastar Chiranjeevi: చిరంజీవి చేయాల్సిన సినిమా ఆ హీరో చేసి హిట్టు కొట్టాడు.. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: May 01, 2024 | 9:18 AM

Share

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ సత్తా చాటుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన భోళా శంకర్ సినిమా మాత్రం నిరాశ పరిచింది. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరు జోడిగా మళ్లీ త్రిష నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. అదేంటంటే.. ఒకప్పుడు చిరు బ్లాక్ బస్టర్ హిట్ మిస్సయారంట. చిరు చేయాల్సిన సినిమాను కోలీవుడ్ నటుడు అర్జున్ చేసి హిట్టు కొట్టారు. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా ?.. అదే ఒకే ఒక్కడు.

డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పింది ఈ మూవీ. ఇందులో అర్జున్ సరసన మనీషా కొయిరాల కథానాయికగా నటించగా.. రఘువరన్ విలన్ గా కనిపించారు. ఇక హీరోయిన్ లైలా మరో కీలకపాత్రలో కనిపించింది. శంకర్ డైరెక్షన్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి. 1999 నవంబర్ 7న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అటు తమిళ్.. ఇటు తెలుగు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ సినిమాను అటు తమిళంలో.. ఇటు తెలుగులో ఒకేసారి రూపొందించాలని అనుకున్నారట. అటు తమిళంలో అర్జున్.. ఇటు తెలుగులో చిరంజీవితో తెరకెక్కించాలని అనుకున్నారు. అప్పటికే చిరుకు ఈ మూవీ స్టోరీ కూడా వినిపించారు. కథ అద్భుతంగా ఉన్నప్పటికీ చిరు ఆ సమయంలో మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమాలో నటించలేకపోయారట. దీంతో రెండు భాషల్లోనూ అర్జున్ తోనే ఈ సినిమాను తెరకెక్కించారు. అలా బ్లాక్ బస్టర్ హిట్ ఒకే ఒక్కడు సినిమాను చిరు మిస్ చేసుకున్నారు. ఒకవేళ చిరు ఈ మూవీ చేసి ఉండే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!