Prabhas: తొలిసారి ఆ రోల్‏లో కనిపించనున్న ప్రభాస్.. స్పిరిట్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో

Prabhas: తొలిసారి ఆ రోల్‏లో కనిపించనున్న ప్రభాస్.. స్పిరిట్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2022 | 9:27 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు డార్లింగ్.. ఈ మూవీతో సౌత్‏లోనే కాకుండా.. నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాందించుకున్నాడు. ప్రభాస్‏తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. ఇక డార్లింగ్ చేస్తోన్న సినిమాల ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా వెండితెరపై ప్రభాస్ కనిపించకపోవడంతో.. డార్లింగ్ తదుపరి సినిమాలపై ఎన్నో అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ ఈనెల 14న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇవే కాకుండా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్.. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇవే కాకుండా.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నాడు. ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్.. రోమాంటిక్, ఊర మాస్ లుక్‏లో కనిపించి మెప్పించారు. తాజాగా స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సినిమా నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభాస్ ఇప్పటివరకు తన కెరీర్ లో పోలీస్ పాత్ర చేయలేదు. స్పిరిట్ సినిమాతో తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠి పట్టుకోనున్నారని తెలిపారు భూషణ్ కుమార్.

Also Read: Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి

RGV On AP Govt. సినిమా టికెట్స్ వ్యవహారం.. ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించిన రామ్ గోపాల్ వర్మ ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే